
సోనియా, మన్మోహన్(ఫైల్)
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంఘీభావంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంఘీభావంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ నివాసం వరకు ర్యాలీ చేపట్టారు.
యూపీఏ హయాం నాటి బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో 83 ఏళ్ల మన్మోహన్ సింగ్ ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.