సోనియా, రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్‌భరో | Sonia, Rahul, if arrested jailbharo | Sakshi
Sakshi News home page

సోనియా, రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్‌భరో

Published Sat, Dec 19 2015 3:29 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా, రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్‌భరో - Sakshi

సోనియా, రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్‌భరో

సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో.. మోదీ సర్కారు కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. సోనియా, రాహుల్‌లను అరెస్టు చేస్తే నేతలు, కార్యకర్తలు జైల్‌భరోకు సిద్ధమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సం బంధించిన అంశాలపై పీసీసీ శుక్రవారం గాంధీభవన్‌లో శ్రేణులకు అవగాహన  కల్పిం చింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరైన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు పేరిట సోనియా, రాహుల్‌లపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోం దని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, ప్రధాని దిష్టిబొమ్మల దహనం వంటి  కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చారు.

నేషనల్ హెరాల్డ్ పత్రిక పూర్తిగా కాం గ్రెస్‌కు చెందినదని.. అందులో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని అన్నారు. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన, అక్రమాలు జరగకున్నా బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన కేసును ఆ పార్టీ అడ్డుపెట్టుకుని వేధిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.
 
కేసుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన అం శాలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ శుక్రవారం గాంధీభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పత్రికకు పార్టీ రూ.90 కోట్లు అప్పు రూపంలో ఇవ్వడంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పార్టీ ఎన్నికల సం ఘం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కంపెనీ.. కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంస్థ అని శ్రవణ్ వెల్లడించారు.

ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే నేషనల్ హెరాల్డ్‌తో పాటు హిందీ, ఉర్దూ దినపత్రికలను కూడా కాంగ్రెస్ నడిపిన విషయాన్ని ప్రస్తావించారు. నిబంధనల ఉల్లంఘన జరగకున్నా మోదీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్న వైనాన్ని వివరించారు. కార్యక్రమంలో పార్టీ శాసన సభా పక్షం నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, మాజీ ఎంపీలు వివేక్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దానం నాగేందర్‌తోపాటు డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement