మెమన్ భార్యకు రాజ్యసభ సీటు? | SP leader sparks controversy, demands RS seat for Memon's wife | Sakshi
Sakshi News home page

మెమన్ భార్యకు రాజ్యసభ సీటు?

Published Sat, Aug 1 2015 12:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

మెమన్ భార్యకు రాజ్యసభ సీటు?

మెమన్ భార్యకు రాజ్యసభ సీటు?

ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలకు సమాజవాదీ పార్టీ (ఎస్పీ) నాయకులు పెట్టింది పేరు. మహారాష్ట్రలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్కు ఫరూక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ములాయం సింగ్కు లేఖ రాశారు.

దేశంలోని ముస్లింల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలను పెద్దల సభలో వినిపించేందుకు ఓ గొంతు కావాలి.... ఈ నేపథ్యంలో రహీన్కు ఈ అవకాశం ఇస్తే... వారి కోసం ఆమె పోరాడుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై మహారాష్ట్రలోని పలు పార్టీలు నిప్పులు చెరిగాయి.

మెమన్కు ఉరిశిక్షపై సుప్రీం కోర్టు కోర్టు నిర్ణయం తీసుకుంది. దీన్ని రాజకీయం చేయొవద్దంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఎస్పీ నాయకులకు హితవు పలికారు. అయినా ఈ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆయన అభివర్ణించారు. దానికి మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందంటూ బీజేపీ నాయకుడు మాదవ్ బండార్  సమాజ్ వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు.

అయితే ఈ విషయంపై ఎస్పీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అసిం అజ్మీ స్పందించారు. ఇది ఫరూక్ వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ అంశంపై ఆయన పార్టీని ఎప్పుడు సంప్రదించలేదన్నారు. అయినా ఈ విషయంపై ఆయన్ని వివరణ కోరతామని... ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement