
కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు
రైతు ఆత్మహత్యలపై ప్రతిస్పందించాలని ప్రభుత్వాలు, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
- రైతు ఆత్మహత్యలపై నాలుగు వారాల్లోగా ప్రతిస్పందించాలన్న ధర్మాసనం
న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముక అయిన రైతులు ఒక్కొక్కరిగా ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సున్నితమైన ఈ అంశంపై వెంటనే ప్రతి స్పందించాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలతోపాటు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు నోటీసులు జారీచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్, జస్టిస్ ఎన్.వి. రమణల నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు శుక్రవారం ఆదేశాలు వెలువరించింది.
‘రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాలు, ఆర్బీఐ నాలుగు వరాలలోగా సమాధానం చెప్పాలి’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ప్రముఖ ఎన్‌జీవో రైతు ఆత్మహత్యలపై దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఈ నోటీసులు జారీచేసింది.