‘రాజకీయాలకు అతీతంగా మన యూపీ బిడ్డకు మద్దతు ఇవ్వండి’ అని సీఎం యోగి పార్టీలను కోరారు.
- రాజకీయాలకు అతీతంగా రామ్‌నాథ్‌కు మద్దతివ్వాలన్న యూపీ సీఎం
లక్నో: తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన రామ్‌నాథ్ కోవింద్‌కు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని రాజకీయపక్షాలూ మద్దతు పలకాల్సిందిగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. సోమవారం లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రామ్‌నాథ్ కోవింద్ స్వస్థలం యూపీలోని కాన్పూర్. ప్రస్తుతం బిహార్ గవర్నర్‌గా ఉన్న ఆయన గతంలో రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగానూ పనిచేశారు. ఆయనకు అభ్యర్థిత్వం దక్కడంపై యూపీ వ్యాప్తంగా పలు చోట్ల బీజేపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. ‘రాజకీయాలకు అతీతంగా మన యూపీ బిడ్డకు మద్దతు ఇవ్వండి’ అని సీఎం ఆదిత్యానథ్ రాజకీయ పార్టీలను కోరారు.