న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్ లిమిటెడ్ కు మరోసారి సుప్రీంకోర్టు షాకిచ్చింది. నోయిడాలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గుర్గావ్ విస్తా ప్రాజెక్టుకు సంబంధించి 34 మంది బాధితులకు సుమారు 15 కోట్ల రూపాయలను రిఫండ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐదు కోట్ల మధ్యంతర నష్టపరిహారాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలని యునిటెక్ మేనేజ్-మెంటును ఆదేశించింది. మిగిలిన మొత్తాన్ని సెప్టెంబర్ చివరి నాటికి చెల్లించాలని తీర్పు చెప్పింది.
కాగాపరిహారం చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సంస్థ డైరెక్టర్లను ధర్మాసనం గతనెలలోనే హెచ్చరించింది. యూనిటెక్ గ్రూప్ కు చెందిన నోయిడా , గుర్గావ్ ప్రాజెక్టులలో కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను స్వాధీనం చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో బాధితులు నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ (ఎన్ సీడీఆర్ సీ)ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కమిషన్ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేయడంపై సీరియస్-గా స్పందించిన కోర్టు యూనిటెక్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లించడానికి ఆగస్టు 12 వరకు గడువు ఇవ్వడంతోపాటు, జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజా యూనిటెక్ తమ దగ్గర డబ్బులు ల్లేవని సుప్రీంముందు నిస్పహాయతను వ్యక్తం చేసింది. అయితే యూనిటెక్ నుంచి సొమ్మును వాపసు కోరుతున్నవారి వివరాలు సమర్పించాలని ఫ్లాట్ కొనుగోలుదారులను శుక్రవారం బెంచ్ కోరిన సంగతి తెలిసిందే.
యూనిటెక్కు మరోసారి షాకిచ్చిన సుప్రీం
Published Wed, Aug 17 2016 12:50 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement