ఏపీ, తెలంగాణలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తమ గ్రామాలు మునిగిపోతాయని ఒడిశా తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయంలో తమకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాల మద్దతు ఉందని కోర్టుకు తెలిపారు.
బచావత్ అవార్డు ప్రకారం తమకు నీటిలో వాటా కావాలని మహారాష్ట్ర తరఫు న్యాయవాది కోరారు. మహారాష్ట్ర అభ్యంతరాలపై తమ వైఖరి తెలపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.