పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సన్నద్ధం అవుతోంది.
హైదరాబాద్ : పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సన్నద్ధం అవుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్డికల్-3 ఉల్లంఘన, రాష్ట్రాభిప్రాయాన్ని తీసుకోకపోవడటం, గిరిజనులకు రాష్ట్రపతి కల్పించిన హక్కులను కాలరాయటంపై తెలంగాణ సర్కార్ కోర్టును ఆశ్రయించనుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును లోక్సభ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ఇంతకాలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఏడు మండలాలు చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోయాయి.