బొగ్గు కుంభకోణం: సీబీఐకి సుప్రీం మొట్టికాయ!
బొగ్గు కుంభకోణం: సీబీఐకి సుప్రీం మొట్టికాయ!
Published Thu, Aug 29 2013 2:52 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి సుప్రీం కోర్టు షాకిచ్చింది. బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో విచారణ ఎందుకు మందగించిందని సీబీఐకి సుప్రీం మొట్టికాయలు వేసింది. బొగ్గు కుంభకోణంలో 169 కంపెనీలపై జరుగుతున్న విచారణను వేగవంతం చేసి.. ఐదు నెలల్లో పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం తెలిపింది.
అంతేకాక బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో ఫైళ్లు మాయం కావడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఫైళ్లు మాయం కావడంపై ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఫైళ్ల మాయం కావడంపై కేంద్ర ఇచ్చిన వివరణపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లను సీబీఐకి అప్పగించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీసింది.
Advertisement