సంసారాల్లో చిచ్చుపెడుతున్న స్మార్ట్ఫోన్ | Taiwanese man files for divorce from smartphone-addicted wife | Sakshi
Sakshi News home page

సంసారాల్లో చిచ్చుపెడుతున్న స్మార్ట్ఫోన్

Published Thu, Jul 31 2014 6:22 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

సంసారాల్లో చిచ్చుపెడుతున్న స్మార్ట్ఫోన్ - Sakshi

సంసారాల్లో చిచ్చుపెడుతున్న స్మార్ట్ఫోన్

బీజింగ్: వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్న స్మార్ట్ ఫోన్ సంసారాల్లో చిచ్చు పెడుతోంది. స్మార్ట్ ఫోన్ మోజు కాపురాలు కూల్చేస్తోంది. తన భార్య స్మార్ట్ ఫోన్ కు బానిస అయిందనే కారణంతో తైవాన్ లో ఓ భర్త విడాకులు కోరాడు. స్మార్ట్ ఫోన్ కు బాగా అలవాటుపడిపోయి ఇంటిని, పిల్లలను ఆమె నిర్లక్ష్యం చేస్తోందని సదరు భర్త వాపోయాడు.

స్మార్ట్ ఫోన్ మోజులో పడి తన చిన్నకూతురికి వ్యాక్సిన్ వేయించడం కూడా మర్చిపోయిందని తలకొట్టుకున్నాడు. ఎంతగా చెప్పి చూసినా ఆమె వైఖరి మారలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఓపిక నశించిపోయి విడాకులు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాడు. అయితే తనపై భర్త చేసిన ఆరోపణలను కోర్టులో భార్య కొట్టిపారేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement