
ఒలింపిక్స్ పతకాల కోసం ఇప్పటి నుంచే
వచ్చే మూడు ఒలింపిక్స్ ఈవెంట్లలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసి, ఆశించిన స్థాయిలో పతకాలు సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపడుతోంది.
న్యూఢిల్లీ: వచ్చే మూడు ఒలింపిక్స్ ఈవెంట్లలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసి, ఆశించిన స్థాయిలో పతకాలు సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపడుతోంది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ కమిటీలో క్రీడాకారులు, మాజీలకు చోటు కల్పించనున్నారు.
రియో ఒలింపిక్స్లో భారత్కు రెండే పతకాలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్లో రజతం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య సాధించడం మినహా స్టార్ క్రీడాకారులు పతకాల వేటలో విఫలమయ్యారు. క్రీడాకారులకు తగిన మౌలికసదుపాయాలు కల్పించి ప్రోత్సహించాలని, చాంపియన్లను తయారు చేయడానికి ప్రభుత్వం తగిన స్పోర్ట్స్ పాలసీని అమలు చేయాలని మీడియా, క్రీడా వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు.