న్యూఢిల్లీ: భారత్‌లో రక్షణ రంగంలో ఉన్న అపార వ్యాపారావకాశాలను చేజిక్కించుకోవడంపై టాటా గ్రూప్ మరింత దృష్టిసారి స్తోంది. రక్షణ పరికరాలు, వాహనాల తయారీకి సంబంధించి 2012-13 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన టాటా గ్రూప్.. ప్రస్తుత 2013-14లో ఈ ఆదాయం రూ.2,300-2,400 కోట్లకు తాకొచ్చని భావి స్తోంది.
ప్రభుత్వం రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు మరింత ద్వారాలు తెరిస్తే... అన్ని విభాగాల్లోకీ ప్రవేశించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, టాటా సన్స్ బ్రాండ్ కస్టోడియన్ ముకుంద్ రాజన్ చెప్పారు. ప్రస్తుతం 100కు పైగా కంపెనీలున్న టాటా గ్రూప్‌లో 14 కంపెనీలు భారత రక్షణ శాఖకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. ఇందులో టాటా మోటార్స్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, టాటా పవర్(స్ట్రాటజిక్ ఇంజినీరింగ్) వంటివి ప్రధానమైనవి. రక్షణ రంగానికి సంబంధించి తమ చేతిలో రూ.8,000 కోట్ల ఆర్డర్లు ఉన్నాయన్నారు.
‘రక్షణ’పై టాటాల దృష్టి
Published Thu, Jan 30 2014 1:22 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement