టాటా గ్రూప్ అమెరికాలో వలస అంశాలు, సాంకేతిక విద్య తదితర అంశాలపై లాబీయింగ్‌ను ముమ్మరం చేసింది.
వాషింగ్టన్/న్యూఢిల్లీ: టాటా గ్రూప్ అమెరికాలో వలస అంశాలు, సాంకేతిక విద్య తదితర అంశాలపై లాబీయింగ్‌ను ముమ్మరం చేసింది. గత రెండేళ్లుగా ఈ విషయంలో స్తబ్ధుగా ఉన్న ఈ గ్రూప్ సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్‌కు లాబీయింగ్ జోరు పెంచిందని అమెరికా సెనేట్‌కు నివేదించిన లాబీయింగ్ డిస్‌క్లోజర్ ఫార్మ్స్ వెల్లడించాయి. టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్, టీసీఎస్‌లు ఈ ఏడాది లాబీయింగ్ కోసం రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేశాయని వెల్లడైంది. అమెరికాలో లాబీయింగ్ చట్టబధ్దమైన వ్యవహారం.
ప్రతి మూడు నెలలకు కంపెనలు తమ తమ లాబీయింగ్ లావాదేవీల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, తదితర అంశాలపై వాల్‌మార్ట్ కంపెనీ అమెరికాలో లాబీయింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. భారత్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలు, ఇంకా ఇతర 50 అంశాలపై వాల్‌మార్ట్ సంస్థ లాబీయింగ్ నిమిత్తం 15 లక్షల డాలర్ల వరకూ వ్యయం చేసినట్లు వెల్లడైంది.