పట్టాలపై పడి మహిళ మృతి
షాజపూర్(మధ్యప్రదేశ్): జనరల్ బోగీలో స్థలంలేక స్లీపర్ కోచ్ ఎక్కిన ప్రయాణికురాలిని రైల్వే టీసీ బయటకు తోసేయడంతో రైలు చక్రాల కింద నలిగి ఆమె మరణించింది. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ సమీపంలోని బెర్చా స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. షాజపూర్ నుంచి భోపాల్ వెళ్తున్న 55ఏళ్ల ఓం కుమారి తెమ్రీ తన కొడుకు, ఇద్దరు కుమార్తెలతో కలసి బెర్చా స్టేషన్‌కు చేరుకుంది.
భోపాల్‌కు వెళ్తున్న మాల్వా ఎక్స్‌ప్రెస్ రైలులో రిజర్వేషన్ ఉన్న స్లీపర్ కోచ్‌లోకి పిల్లలతోసహా ఎక్కింది. జనరల్ బోగీ వారు స్లీపర్ కోచ్‌లోకి రావొద్దని గట్టిగా అరుస్తూ టీసీ అందరినీ బయటకు నెట్టేశాడు. దాంతో అదుపుతప్పిన తెమ్రీ కదులుతున్న రైలు కింద పడి మరణించింది. మరణానికి కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని మాక్సీ పోలీసు అధికారి ఎన్ పాఠక్ మీడియాకు తెలిపారు.
ప్రయాణికురాలిని రైల్లోంచి తోసేసిన టీసీ
Published Sun, Sep 27 2015 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM
Advertisement
Advertisement