Railway TC
-
ఏసీ బెర్త్‌కు రూ.1000.. నాన్ ఏసీకి రూ.500
సాక్షి, హైదరాబాద్: ఏసీ బెర్త్‌కు రూ.1000..నాన్ ఏసీ బెర్త్‌కు రూ.500. ఇవి టికెట్ చార్జీలు కాదు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్తులు కావాలంటే టికెట్ కలెక్టర్లకు (టీసీలకు) సమర్పించుకోవలసిన ఆమ్యామ్యాలు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రైళ్లు, కొన్ని ప్రత్యేక రైళ్లలో ఈ తరహా బేరాలు జోరుగా సాగుతున్నాయి. టీసీలే స్వయంగా డబ్బులు తీసుకొని బెర్తులు కట్టబెట్టడంతో వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న వారు నిశ్చింతంగా ప్రయాణం చేస్తున్నారు. నిజానికి టికెట్ నిర్ధారణ అయితే తప్ప ట్రైన్లో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. ప్రతి ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు ప్రయాణికుల జాబితా విడుదల అవుతుంది. ఆ జాబితాలో ఉన్న వాళ్లు మాత్రమే రిజర్వేషన్ లభించిన ప్రయాణికులు. కానీ ప్రతి ట్రైన్‌కు వందల సంఖ్యలో వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికులు ఉంటారు. చార్ట్ (జాబితా) సిద్ధమైన తరువాత వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి టికెట్ డబ్బులు వారి ఖాతాలోకి ఆటోమేటిక్‌గా రీఫండ్ అవుతాయి. కానీ కొందరు ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ప్రయాణం చేస్తారు. ఏదో ఒకవిధంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో టికెట్లను రద్దు చేసుకోకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో ఈ తాకిడి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులపైనే కొందరు టీసీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నాన్ ఏసీ స్లీపర్ బోగీల్లో బెర్తులకు రూ.500, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో బెర్తులకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.శబరి రైళ్లకు డిమాండ్ ఫుల్... ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు తరలివెళ్తున్నారు. కొంతమంది సాధారణ భక్తులు సైతం దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజు రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్రత్యేక రైళ్లకు సైతం డిమాండ్ బాగా ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లాలన్నా, ఫ్లైట్‌లో వెళ్లాలన్నా పెద్దమొత్తంలో వెచ్చించవలసి ఉంటుంది. చార్జీల భారం దృష్ట్యా ఏదోఒకవిధంగా రైళ్లలో వెళ్లడమే మంచిదని భావించే వెయిటింగ్‌లిస్ట్ ప్రయాణికుల అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలోని వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాలకు చెందిన నలుగురు స్నేహితులు నవంబర్ 27వ తేదీన 12 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17230)లో సికింద్రాబాద్ నుంచి శబరికి బయలుదేరారు. వాళ్ల ప్రయాణానికి ఇంచుమించు నెల రోజుల క్రితమే సెకండ్ ఏసీ రిజర్వేషన్ కోసం టికెట్లు కొనుగోలు చేశారు. కానీ ప్రయాణ తేదీ నాటికి కూడా టికెట్లు నిర్ధారణ కాలేదు. రిజర్వేషన్ లభించలేదు. చార్ట్ (ప్రయాణికుల జాబితా) సిద్ధమైన తరువాత కూడా ఆ ప్రయాణికులు వెయిటింగ్ జాబితా (5 నుంచి 8 వరకు)లోనే ఉండిపోయారు. అయినప్పటికీ టికెట్లను రద్దు చేసుకోకుండా అదే ట్రైన్లో బయలుదేరారు. రైలు ప్రారంభమైన కొద్దిసేపటికి వెళ్లి టీసీని సంప్రదించారు. ‘మొదట్లో ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోయినప్పటికీ ట్రైన్ తిరుపతికి చేరుకున్న తరువాత ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1000 చొప్పున మొత్తం రూ.4000 తీసుకొని నాలుగు బెర్తులు కేటాయించాడు. సెకండ్ ఏసీలోనే ఆ సదుపాయం లభించడంతో ప్రయాణం నిశ్చింతగా సాగింది.’ అని ఆ ప్రయాణికులు చెప్పారు. తమతో పాటు మరి కొందరికి కూడా రూ.1000 చొప్పున తీసుకొని ఏసీ బోగీల్లో, రూ.500 చొప్పున తీసుకొని స్లీపర్‌లో బెర్తులు ఇచి్చనట్లు వారు చెప్పారు.ఎలా సాధ్యం... ⇒ రిజర్వేషన్లు నిర్ధారణ అయిన ప్రయాణికులు ఆకస్మికంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకో వ చ్చు. అలాంటి వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ట్రైన్లో విధులు నిర్వహించే టికెట్ ఎగ్జామినర్, టికెట్ కలెక్టర్, తదితర సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికుల వివరాలను తమ వద్ద ఉండే హ్యాండ్ హెల్డ్ మిషన్లలో నమోదు చేయాలి. ⇒ ఈ క్రమంలోనే కొందరు టీసీలు ఇలాంటి ప్రయాణికుల వివరాలను నమోదు చేయడంలోనే తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు.⇒ సదరు ప్రయాణికుల పేరు వద్ద ‘కాన్సిల్’ అని కాకుండా ‘జాయిన్’ అని నమోదు చేసి ఆ బెర్తులను వెయిటింగ్ లిస్ట్ వాళ్లకు కేటాయిస్తున్నారు. అయితే ఆన్లైన్ టికెట్లపైన ఇది సాధ్యం కాదు. రిజర్వేషన్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే టీసీలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. -
రైళ్లలో నకిలీ టీసీలు
చీరాల: రైళ్లలో దోపిడీ దొంగలే కాదు.. టీసీల పేరుతో కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు. టికెట్ లేని ప్రయాణికులు, రిజర్వేషన్ స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతి లేకుండా ఎక్కిన వారే వీరి టార్గెట్. మెడలో ఒక నకిలీ రైల్వే ఐడీ కార్డు, నకిలీ రశీదు బుక్‌తో చూడడానికి నిజమైన టికెట్ కలెక్టర్లా మాట్లాడుతూ టికెట్ తీసుకోని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ కొత్త రకం దోపిడీకి పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ ముందస్తుగా అనుకున్న రైళ్లలోనే వెళుతుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. అతడే కీలకం బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్ తెనాలిలో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి.గణేష్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంతా కళ్యాణ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి.ప్రవీణ్ వద్ద లక్ష రూపాయలు తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వారిని తనతో ఉంచుకుని విజయవాడ– నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు. రోజూ అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో చెప్పేవాడు. రైళ్లలో టికెట్ లేనివారిని గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేయించేవాడు. జరిమానాల సొమ్మును భారీగా తీసుకునేవాడని తెలిసింది. ముందుగా అనుకున్న రైళ్లలోనే టీసీలుగా వెళ్లి టికెట్ తీసుకోని ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య అనుకున్న రైల్వేస్టేషన్లలో దిగి మరో రైలు ఎక్కుతూ జరిమానాలు విధిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు వచ్చిన వారు చీరాల రైల్వేస్టేషన్లో అసలు టీసీకి దొరికిపోయారు. టీసీలా వ్యవహరిస్తున్న వారిపై అనుమానం రావడంతో ముగ్గురిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. దీంతో జీఆర్పీ పోలీసులు విచారించగా సాయి ప్రసాద్ బాగోతం బయటపడింది. సాయి ప్రసాద్ వలే విజయవాడలో ఇదే తరహాలో మరో వ్యక్తి దందా సాగిస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్ఐ కొండయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా పట్టుబడిన ముగ్గురు మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులిచ్చినట్టు తెలిపారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
టీటీఈలకు బాడీ కెమెరాలు
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది. ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. -
అభినవ ‘ఏకలవ్యుడు’!
ప్రకాశం: సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చేతల్లో చూపాడు ఓ యువకుడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని ఆ అభినవ ‘ఏకలవ్యుడు’ యూట్యూబ్‌ను గురువుగా ఎంచుకున్నాడు. ఏకంగా రెండు రైల్వే ఉద్యోగాలకు ఎంపికై అందరి దృష్టి తనవైపునకు తిప్పుకున్నాడు. కొమరోలు మండలం పోసుపల్లె గ్రామానికి చెందిన బొంత చిన్నకొండారెడ్డి, మహాలక్ష్మి దంపతులది పేద కుటుంబం. కష్టనష్టాలకోర్చి వ్యవసాయం చేస్తూనే తమ కుమారుడు తిరుపతిరెడ్డి డిగ్రీ వరకు చదివించారు. బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పట్టా పొందిన తిరుపతిరెడ్డి రైల్వే ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. కోచింగ్ సెంటర్లకు వెళ్లేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. దీంతో తల్లిదండ్రులకు వ్యవసాయంలో చేదోడుగా ఉంటూ యూట్యూబ్‌ను వీడియోలు చూసి సొంతగా ప్రిపరేషన్ ప్రారంభించాడు. ప్రభుత్వ వెబ్సైట్లు, యూట్యూబ్ వీడియోల నుంచి సంగ్రహించిన సమాచారంతో నోట్స్ తయారు చేసుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఎన్టీటీసీ–2019 నోటిఫికేషన్ విడుదల కాగా కమర్షియల్ కం టికెట్ క్లర్క్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఆ పరీక్షను రైల్వే శాఖ 2021లో నిర్వహించగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. 2022లో మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురు చూడసాగాడు. తలుపుతట్టిన అదృష్టం.. రైల్వే శాఖ గ్రేడ్–4 ఉద్యోగాల ఎంపికకు నిర్వహించిన పరీక్షలో తిరుపతిరెడ్డి సత్తా చాటాడు. బుధవారం బెంగళూరులో గ్రేడ్–4 ఉద్యోగంలో చేరాల్సి ఉంది. మరికొద్ది నిమిషాల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్న తరుణంలో ఎన్టీటీసీ–2019 నోటిఫికేషన్‌కు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. కమర్షియల్ కం టికెట్ క్లర్క్ ఉద్యోగానికి ఎంపికై నట్లు తెలియగానే తిరుపతిరెడ్డి సంతోషానికి అవధుల్లేవు. దీంతో గ్రేడ్–4 ఉద్యోగంలో చేరకుండానే బెంగళూరు నుంచి స్వగ్రామమైన పోసుపల్లెకు తిరుగుప్రయాణం అయ్యాడు. ఒకటే చానల్.. ఒకటే లక్ష్యం మాది పేద కుటుంబం. జాబ్ కోచింగ్‌కు వేల రూపాయలు ఖర్చు చేసే స్థోమత నా తల్లిదండ్రులకు లేదు. జాబ్ ప్రిపరేషన్‌కు సంబంధించి యూట్యూబ్‌లో చాలా చానల్స్ ఉన్నాయి. నేను వైఫై అనే చానల్‌ను ఫాలో అవుతూ సొంతగా నోట్స్ తయారు చేసుకున్నా. రోజూ 5 గంటలపాటు శిక్షణ పొందా. సెల్ఫ్ మోటివేషన్‌తో ప్రభుత్వం ఉద్యోగం పొందాలన్న నా కల సాకారమైంది. – బొంత తిరుపతిరెడ్డి -
వైరల్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
-
షాకింగ్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
కోల్‌కతా: రైల్వే లైన్ ఓల్టేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలుసు. ఆ తీగలను తాకిన క్షణాల్లోనే కాలి బూడిదవుతారు. అలాంటి ఓ హైఓల్టేజ్ విద్యుత్తు వైరు తెగి మీద పడితే.. ఎంత ప్రమాదమో ఊహించనక్కర్లేదు. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని ఖారగ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. అదీ ప్లాట్ ఫారమ్‌పై ఉన్న వ్యక్తిపై తెగి పడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే? ఖారగ్పూర్ రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్ ఫారమ్‌పై టికెట్ కలెక్టర్(టీసీ) నిలుచుని ఉండగా.. ఒక్కసారిగా హైఓల్టేజ్ విద్యుత్తు తీగ ఆయనపై పడింది. క్షణాల్లో తీగతో పాటే ట్రాక్‌పై పడిపోయాడు టీసీ. ఆయనతో మాట్లాడుతున్న మరో వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. బాధితుడు సుజన్ సింఘ్ సర్దార్‌గా గుర్తించారు. విద్యుత్తు షాక్‌తో తీవ్ర గాయాలైన టీసీని రైల్వే సిబ్బంది, అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. దీనిపై అనంత్ రూపనగూడి అనే రైల్వే సిబ్బంది ట్విటర్లో వీడియో షేర్ చేశారు. ‘విచిత్రమైన ప్రమాదం. ఒక పెద్ద లూస్ కేబుల్ పక్షుల వల్ల ఓహెచ్ఈ తీగపై పడింది. దీంతో హైఓల్టేజ్ తీగ టీటీఈ తలపై పడింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.’ అని రాసుకొచ్చారు. మరోవైపు.. తీగ తెగి పడడానికి గల కారణాలు తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు. A freak accident - a long piece of loose cable, taken by a bird somehow came in contact with the OHE wire and the other end came down and touched a TTE's head. He suffered burn injuries but is out of danger and under treatment - at Kharagpur station yesterday afternoon! #Accident pic.twitter.com/ObEbzd1cOF — Ananth Rupanagudi (@Ananth_IRAS) December 8, 2022 ఇదీ చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే పట్టుకునే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. ఇకపై టికెట్ తీయకుండా ప్రయాణించేవారి ఆటలు సాగవు. ఇంతకాలం టికెట్ కలెక్టర్ల చేతిలో కాగితాల చార్ట్ మాత్రమే ఉండేది. తదుపరి స్టేషన్లో ఎన్ని బెర్తులు బుక్ అయ్యాయి, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి.. లాంటి వివరాలు రైలు కదిలితే తప్ప చేతికి అందేవి కాదు. దీంతో రిజర్వేషన్ ఉన్న వారెవరో, టికెట్ లేని వారెవరో, ఆర్‌ఏసీతో ప్రయాణిస్తున్నవారు ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవటానికి సమయం పట్టేది. కానీ, ఇప్పుడు టీసీలందరికి హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (హెచ్‌హెచ్‌టీ) యంత్రాలను అందిస్తున్నారు. ఇవి రైల్వే ప్రధాన సర్వర్‌తో అనుసంధానమై ఉం టాయి. దీంతో ఎక్కడ కొత్త టికెట్ బుక్ అయినా చిటికెలో టీసీలకు సమాచారం తెలుస్తుంది. దీంతో టికెట్ లేని ప్రయాణికులను గుర్తించటం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది రూ.111.52 కోట్ల జరిమానా గత ఆర్థిక సంవత్సరంలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారిపై కేసులు రాయటం ద్వారా రూ.111.52 కోట్ల ఆదాయాన్ని రైల్వే ఆర్జించింది. కాగా, బుధవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో టికెట్ తనిఖీ అంశంపై సమీక్ష జరిగింది. హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్‌ను ఎక్కువసంఖ్యలో అందించాలని నిర్ణయించారు. దీనివల్ల టికెట్ లేని ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఆదాయం కూడా అధికంగా నమోదవుతుందని గుర్తించారు. -
ప్రయాణికురాలిని రైల్లోంచి తోసేసిన టీసీ
పట్టాలపై పడి మహిళ మృతి షాజపూర్(మధ్యప్రదేశ్): జనరల్ బోగీలో స్థలంలేక స్లీపర్ కోచ్ ఎక్కిన ప్రయాణికురాలిని రైల్వే టీసీ బయటకు తోసేయడంతో రైలు చక్రాల కింద నలిగి ఆమె మరణించింది. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ సమీపంలోని బెర్చా స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. షాజపూర్ నుంచి భోపాల్ వెళ్తున్న 55ఏళ్ల ఓం కుమారి తెమ్రీ తన కొడుకు, ఇద్దరు కుమార్తెలతో కలసి బెర్చా స్టేషన్‌కు చేరుకుంది. భోపాల్‌కు వెళ్తున్న మాల్వా ఎక్స్‌ప్రెస్ రైలులో రిజర్వేషన్ ఉన్న స్లీపర్ కోచ్‌లోకి పిల్లలతోసహా ఎక్కింది. జనరల్ బోగీ వారు స్లీపర్ కోచ్‌లోకి రావొద్దని గట్టిగా అరుస్తూ టీసీ అందరినీ బయటకు నెట్టేశాడు. దాంతో అదుపుతప్పిన తెమ్రీ కదులుతున్న రైలు కింద పడి మరణించింది. మరణానికి కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని మాక్సీ పోలీసు అధికారి ఎన్ పాఠక్ మీడియాకు తెలిపారు.