దేశంలోనే తెలంగాణ నెంబర్వన్గా నిలుస్తుంది
హైదరాబాద్ : నిస్సందేహంగా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. అందుకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు కేసీఆర్ వివరించారు. మేనిఫెస్టోలో లేని పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన విశదీకరించారు. వచ్చే ఎన్నికల్లోగా తండాలను పంచాయతీలుగా మారుస్తామన్నారు కేసీఆర్ స్పష్టం చేశారు.
భారమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులను
కేసీఆర్ సభలో ప్రకటించారు. అలాగే సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా కేసీఆర్ వెల్లడించారు. అయితే నల్గొండ జిల్లా
రామన్నపేట సమీపంలో ఈ రోజు చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఈ సందర్భంగా కేసీఆర్ సభలో హామీ ఇచ్చారు. ఆర్టీసీ తరఫున ఒక్కొక్కరికి రూ. లక్ష నష్టపరిహారం అందజేస్తామని కేసీఆర్ చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో విద్యార్థులకు సన్న బియ్యం అన్నం అందిస్తామన్నారు.