ఇరాక్‌లో తెలుగుకార్మికుల ఇక్కట్లు
మోర్తాడ్: పొట్ట చేత పట్టుకొని ఇరాక్‌లో పని కోసం వెళ్లిన కార్మికులు ఏజెంట్ల మోసాలతో పడరాని పాట్లు పడుతున్నారు. ఇరాక్‌లో పని చేయడానికి తెలంగాణ జిల్లాల్లోని పలువురు కార్మికులు ఆసక్తి చూపగా వారిని అక్కడికి పంపించిన ఏజెంట్లు వర్క్ వీసాలకు బదులు విజిట్ వీసాలు చేతిలో పెట్టారు. అప్పులు చేసి ఇరాక్ వెళ్లిన కార్మికులు విజిట్ వీసా గడువు ముగిసిపోగా ఇంటికి రాకుండా పనిచేస్తూ అక్కడే ఉండిపోయారు. అక్రమంగా ఉంటు న్నవారిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగడంతో కార్మికుల్లో గుబులు పట్టుకుంది. విజిట్ వీసాపై వెళ్లినవారికి పని ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రాకపో వడంతో తప్పనిసరిగా ఇంటికి రావాల్సి వస్తోం ది. ఈ క్రమంలో తిరిగి వచ్చేందుకు అవస రమైన ఔట్ పాస్ పోర్టులను జారీ చేసేందుకు ఇరాక్ ప్రభుత్వం రెండు వేల డాలర్ల జరి మానా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
గతంలో 400 డాలర్లు జరిమానా ఉండగా, ఇప్పుడు దానిని పెంచడంతో అక్కడి తెలంగాణ కార్మికుల పరిస్థితి దిక్కుతోచకుంది. ఇరాక్‌లో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, మంచిర్యాల్, కామారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది కార్మికులు ఇరాక్‌లో అక్రమంగా ఉన్నారు. వారిలో 33 మంది తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బసంత్ రెడ్డి చొరవతో ఇటీవల ఇంటికి చేరుకున్నారు. విదేశాంగ శాఖ, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌తో చర్చించి జరిమానా లేకుండా ఇంటికి రప్పిం చారు. మిగిలిన కార్మికులను కూడా ఇలాగే తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని బాధితులు కోరుతున్నారు.
జరిమానా చెల్లిస్తేనే ఇంటికి...
Published Sat, Jan 7 2017 4:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement