Visit Visa
-
యూఏఈలో విజిట్ వీసా నిబంధనలు కఠినతరం
మోర్తాడ్(బాల్కొండ): వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. విజిట్ వీసాలపై యూఏఈకి వచ్చినవారు గడువు ముగిసిన తర్వాత ఒక్కరోజు కూడా ఎక్కువగా ఉండడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టింది. సాధారణంగా యూఏఈ 30, 60 రోజుల విజిట్ వీసాలను జారీ చేస్తుంటుంది. ఈ వీసాలపై యూఏఈకి వచ్చినవారు గడువు ముగిసిపోకముందే వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇకపై తమ దేశంలో ఒక్కరోజు ఎక్కువగా ఉన్నా నిషేధిత జాబితాలో చేరుస్తామని అక్కడి సర్కారు ప్రకటించింది. దీనివల్ల వీసా నిబంధనలు ఉల్లంఘించినవారు యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో ప్రవేశానికి అనర్హులు అవుతారు. విజిట్ వీసాలపై వచ్చి యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్నవారి సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు ఎవరైనా చట్టబద్ధంగానే తమ దేశంలో ఉండే విధంగా యూఏఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. యూఏఈలో ఉపాధి చూపిస్తామని.. తొలుత విజిట్ వీసాపై వెళ్లాక, తర్వాత వర్క్ వీసా ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్ల మాటలను నిరుద్యోగులు నమ్మవద్దని గల్ఫ్ వలస కారి్మక సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు. -
ఉండలేక.. తిరిగి రాలేక...
మోర్తాడ్ (బాల్కొండ): పొరుగు దేశాలతో వాణిజ్య వ్యాపార సంబంధాలను వృద్ధి చేయడానికి ఒమన్ ప్రభుత్వం విరివిగా జారీ చేసిన విజిట్ వీసాలను కొందరు దళారులు పక్కదారి పట్టించారు. ఒమన్ లో వ్యాపారం చేయడానికి విదేశీయులకు జారీ చేసిన విజిట్ వీసాలను నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. ఫలితంగా ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లిన వందలాది మంది తెలంగాణ వలస కార్మికులు ఆ దేశంలో ఇరుక్కుపోయారు. విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో అక్కడ ఉండలేక, ఇంటికి చేరాలంటే రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో మగ్గుతున్నారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఒమన్ విదేశీ వ్యాపారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టింది. ఇలా ఐదు నెలల కింద విజిట్ వీసాలను ఎక్కువగా జారీ చేసింది. ఒకసారి జారీ చేసిన విజిట్ వీసాను రెండుమార్లు గడువు పొడిగించుకోవడానికి ఒమన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ఔత్సాహికులను నకిలీ ఏజెంట్లు ఆకర్షించారు. ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లి వర్క్ వీసా పొందవచ్చని నమ్మించారు. 300 మంది తెలంగాణ వలస కార్మికులు ఉచితంగా జారీ చేసిన విజిట్ వీసాలను రూ.80 వేలకు ఒకటి చొప్పున విక్రయించి దాదాపు 300 మంది తెలంగాణ వలస కార్మికులను తరలించారు. విజిట్ వీసాలపై వచ్చినవారికి ఒమన్‌లోని కంపెనీలు పనులు ఇవ్వడానికి నిరాకరించాయి. ఒక నెల విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో మరో నెల రోజులకు పొడిగించుకుని ఉపాధి అవకాశాల కోసం కార్మికులు ప్రయత్నించారు. కంపెనీలలో ఉన్నవారికే సరైన పని లేకపోవడంతో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు ఇచ్చే అవకాశం అసలే లేకపోయింది. కొందరు వలస కార్మికులు తమ చేతిలో డబ్బు లేకపోవడంతో వీసా గడువు పొడిగించుకోలేక రహస్యంగా అక్కడే ఉండిపోయారు. పార్కులు, స్నేహితుల గదుల్లో కార్మికులు తలదాచుకుంటున్నారు. వీసా రెన్యూవల్, జరిమానా చెల్లించేందుకు డబ్బుల్లేకపోవడంతో వలస కార్మికులు స్వదేశం తిరిగి రావడానికి అవస్థలు పడుతున్నారు. వీసా ఉంటేనే రావాలి: గుండేటి గణేశ్ ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ ప్రతినిధి గుండేటి గణేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ దేశానికి విజిట్ వీసాపై వచ్చిన వారికి పనులు ఇవ్వడం లేదన్నారు. కంపెనీ వీసా ఉంటేనే ఒమన్‌కు రావాలని సూచించారు. చిక్కుకుపోయిన వలస కార్మికులను మాతృభూమికి పంపించడానికి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని గణేశ్ వివరించారు. -
యూఎస్ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్. తొలిసారి వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లకు ఊరట ఇచ్చింది అగ్రరాజ్యం. వీసా కోసం పడిగాపులు పడకుండా ఉండేందుకు అదనపు చర్యలు చేపట్టింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత మూడేళ్ల నుంచి విజిటర్ వీసా కోసం వేల మంది పడిగాపులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వీసా ప్రాసెసింగ్‌లో ఉన్న బ్యాక్లాగ్ సమస్యను పరిష్కరించడానికి.. శనివారాల్లో ప్రత్యేక వీసా ఇంటర్వ్యూలను నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా అదనపు స్లాట్లతో భారీగా అప్పాయింట్మెంట్లు అందుబాటులోకి రాన్నాయి. వీసా దరఖాస్తుదారుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించే ఈ భారీ ప్రయత్నంలో భాగంగా.. జనవరి 21వ తేదీన న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని కాన్సులేట్లు విజిటర వీసా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఇందుకోసం డజన్ల కొద్దీ తాత్కాలిక సిబ్బందిని నియమించారు కూడా. ఇక ఈ ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడానికి జనవరి మరియు మార్చి 2023 మధ్య వాషింగ్టన్, ఇతర రాయబార కార్యాలయాల నుండి డజన్ల కొద్దీ తాత్కాలిక కాన్సులర్ అధికారులు భారతదేశానికి రానున్నారు. మరోవైపు ఎంబసీ, కాన్సులేట్లకు శాశ్వతంగా కేటాయించిన కాన్సులర్ అధికారుల సంఖ్యను కూడా పెంచుతోంది. "రాబోయే రోజుల్లో.. ఎంపిక చేసిన శనివారాల్లో అపాయింట్మెంట్ల కోసం అదనపు స్లాట్లను తెరుస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదిలా ఉంటే.. ఇదివరకే మునుపటి అమెరికా వీసాలతో ఉన్న దరఖాస్తుదారుల కోసం ఇంటర్వ్యూలను మినహాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్‌ను అమలు చేసింది. అటువంటి దరఖాస్తుదారులు ఇకపై వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరుకావలసిన అవసరం లేదు. -
వలస కార్మికులకు బహ్రెయిన్ షాక్
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన కొట్టూరి శ్రీకాంత్ రెండు నెలల కిందట విజిట్ వీసాపై బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ ఏదో ఒక కంపెనీలో పని చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ విజిట్ వీసాపై వచ్చిన వారికి పని ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి. ఫలితంగా విజిట్ వీసా గడువు ముగిసేలోపు శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు. బహ్రెయిన్‌కు వెళ్లడానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయగా ఈ డబ్బును శ్రీకాంత్ నష్టపోవాల్సి వచ్చింది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఎండీ ఇబ్రహీం కొన్నేళ్ల నుంచి బహ్రెయిన్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల కిందట ఇంటికి వచ్చి మళ్లీ బహ్రెయిన్ వెళ్లాడు. అతనికి మరో రెండేళ్ల వరకు అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ అక్కడి ప్రభుత్వ ఆధీనంలోని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఏ) అనేక మంది వలస కార్మికుల వీసాలను అర్ధంతరంగా రద్దు చేసింది. ఫలితంగా ఇబ్రహీం ఇంటికి వచ్చేశాడు. విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బహ్రెయిన్‌లో పర్యాటక రంగం వృద్ధి చెందడంతో ఆ దేశానికి వెళితే ఏదో ఒక పని చేసుకోవచ్చని వలస కార్మికులు ఆశిస్తున్నారు. అదే ఆశతో విజిట్ వీసాపై వెళ్లిన శ్రీకాంత్ ఇంటి దారి పట్టగా, వర్క్ వీసాకు గడువున్నా ఇబ్రహీం కూడా బలవంతంగా ఇంటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వందలాది మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. మోర్తాడ్ (బాల్కొండ): బహ్రెయిన్‌లో ఉపాధి పొందవచ్చని భావిస్తున్న ఎంతో మంది వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం షాకిస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమాన్‌ల మాదిరిగానే బహ్రెయిన్ కూడా ఎంతో మంది తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పించింది. అయితే ఇకనుంచి అది చరిత్రగానే మిగిలిపోనుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు, వలస కార్మికుల వీసాలను పర్యవేక్షించే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అనుసరిస్తున్న విధానాలతో బహ్రెయిన్‌లో ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి. వారం, పది రోజుల వ్యవధిలోనే తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు దాదాపు రెండు వేలమంది బహ్రెయిన్ నుంచి ఇంటిదారి పట్టారని అంచనా. వర్క్ వీసాలను రద్దు చేయడం, విజిట్ వీసాలపై వెళ్లి పని వెతుక్కునేవారికి ఎల్ఎంఆర్ఏ ఇచ్చిన ఆదేశాలతో కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో ఉపాధి కరువైంది. బహ్రెయిన్ ప్రభుత్వం పునరాలోచన చేస్తే తప్పా ఆ దేశంలో వలస కార్మికుల ఉపాధికి అవరోధాలు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బహ్రెయిన్‌కు వెళ్లే ఆలోచన మానుకోవాలని వలస కార్మికుల సంఘాలు సూచిస్తున్నాయి. -
బహ్రెయిన్ విజిట్ వీసా నిబంధనలు కఠినతరం
మోర్తాడ్ (బాల్కొండ): బహ్రెయిన్ దేశం విజిట్ వీసాల నిబంధనలను కఠినతరం చేసింది. తమ దేశానికి విజిట్ వీసాలపై వచ్చిన వారు గడువు ముగిసిపోయినా ఇంకా ఉండిపోతున్నారని బహ్రెయిన్ ప్రభుత్వం గుర్తించింది. గతంలో విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లేవారు డమ్మీ రిటర్న్ టికెట్‌ను చూపేవారు. రిటర్న్ టికెట్ విషయంలో ఇప్పటివరకు బహ్రెయిన్ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజా నిబంధనల ప్రకారం ఇప్పుడు పక్కాగా కొనుగోలు చేసిన రిటర్న్ టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. అంటే విజట్ వీసాపై వచ్చినవారు కచ్చితంగా వెనక్కు వెళ్లిపోవాలి. విజిట్ వీసాలపై వచ్చిన వారు ఏ హోటల్లో బస చేస్తున్నారో ఆ హోటల్లో గదులను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇవేమీ పట్టించుకునేవారు కాదు. విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లేవారు మన కరెన్సీలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు దినార్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు కనీసం 50 దినార్లు ఖర్చు చేయాలి. విజిట్ వీసాలపై వచ్చినవారు కేవలం పర్యాటక ప్రాంతాలను చూసి తిరుగు ప్రయాణం కావాలి. ఇప్పటివరకు అనేక మంది విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉంటూ ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం దక్కించుకుంటూ ఉండిపోతున్నారు. ఇలా అక్రమంగా ఉంటున్నవారి సంఖ్య పెరిగిపోవడంతో వారి సంఖ్యను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దీంతో తొలుత విజిట్ వీసాల నిబంధనల్లో మార్పులు చేసింది. (క్లిక్ చేయండి: యాదాద్రి ప్లాంట్‌కు ‘పర్యావరణ’ కష్టాలు!) -
యూఏఈ ప్రభుత్వం ఖుషీ ఖబర్.. స్పాన్సర్ లేకుండా సొంతంగా వ్యాపారం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసదారులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం ఖుషీ ఖబర్ అందించింది. వీసా నిబంధనలను సవరిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో ఆ దేశానికి వెళుతున్న వలసదారులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి, అజ్మన్, షార్జా తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఆ దేశానికి చెందిన వారి ద్వారానే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా స్పాన్సర్ మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారం చేయాలనుకుంటే 51 శాతం స్పాన్సర్ పెట్టుబడి, మిగిలిన 49 శాతం వలసదారుడు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్పాన్సర్ పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా వలసదారుడే మొత్తం పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటాను పంచిపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్పాన్సర్‌తో సంబంధం లేకుండా యూఏఈ ప్రభుత్వం అనుమతితో ఎవరైనా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విజిట్ వీసా గడువు 60 రోజులకు పెంపు విజిట్ వీసా కాలపరిమితి 30 రోజులే ఉండగా ఇప్పుడు 60 రోజులకు పెంచారు. అనుకోని సందర్భంలో ఉద్యోగం కోల్పోయినవారు వెంటనే ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఆరు నెలల వరకు అక్కడే ఉండి మరో కంపెనీలో పని వెతుక్కుని వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు. గతంలో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇంటికి రావడం లేదా కార్మికునిగా ఉండిపోయి పోలీసులకు దొరికితే కటకటాల పాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐదు సంవత్సరాల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా ఉన్నవారు వరుసగా మూడు నెలల పాటు యూఏఈలో ఉండవచ్చు. గ్రీన్ వీసా పొందినవారు తమకు ఉన్న పర్మిట్ పూర్తయితే రెన్యువల్ చేసుకోవడానికి ఆరు నెలల గడువును పొడిగించారు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈనెల 3 నుంచి అమలులోకి వచ్చింది. యూఏఈకి వలస వెళుతున్న వారిలో భారతీయుల సంఖ్యనే అధికంగా ఉండటంతో వీసా నిబంధనల సవరణ ప్రయోజనాలు ఎక్కువ శాతం మనవారికే కలుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మా వాళ్లను విడిపించరూ..!
జన్నారం(ఖానాపూర్): ‘మా నాన్న మాతో మాట్లాడక రెండు నెలలయితంది. ఇరాక్ దేశంలో జైళ్లో పడ్డాడట. అమ్మ వాళ్లు ఏడుస్తున్నరు. మా కోసం వేరే దేశం వెళ్లిన మా నాన్నను ఇంటికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలి. కేటీఆర్ సార్ మా మీద దయ చూపాలి, మా నాన్నను తీసుకురావాలి’అని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల లచ్చన్న పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కవ్వాల్ గ్రామానికి చెందిన లచ్చన్న, షేర్ల రాజు ఉపాధి కోసం 2015లో ఇరాక్ వెళ్లారు. వీసా కోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్‌కు రూ.1.50 లక్షలు కట్టారు. ఏజెంట్ విజిట్ వీసాతో వారిని అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ మోసం చేశాడని తెలిసింది. దీంతో తెలిసిన వారి వద్ద ఉంటూ దొంగ చాటుగా పనిచేస్తూ జీవించారు. ఏడాది తర్వాత పనిచేసిన డబ్బులతో అఖా మా చేయించుకున్నారు. ఆ సమయంలో అప్పుల పాలయ్యారు. అఖామా వచ్చాక ఎర్బిల్లోని పాఠశాలలో పని దొరికింది. ఇద్దరూ అక్కడే పని చేస్తూ అఖామాకు చేసిన అప్పులు తీర్చారు. ఇక స్వదేశంలో చేసిన అప్పులే తీర్చాల్సి ఉంది. అప్పులు తీర్చి ఇంటికి వద్దామనుకున్నారు. ఏప్రిల్ 16న పోలీసులు వచ్చి ఎలాంటి కారణం లేకుండా వారిద్దరినీ పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారో.. ఎన్ని రోజులు జైళ్లో ఉంచుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. -
ఇస్త్రీ చేసేయ్.. వీసా మార్చేయ్!
ఉద్యోగ వీసాను కంప్యూటర్లో ఫొటోషాప్ ద్వారా సందర్శక వీసాగా మార్చి ఇమిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించి కువైట్‌కు పలువురిని అక్రమంగా తరలిస్తున్న 15 మంది ఏజెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ఒక పోలీసు కానిస్టేబుల్‌ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏజెంట్లు ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయం ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తమను ఆశ్రయించిన వారి చేతికి అందిన వెంటనే .. వేడిచేసిన ఇస్త్రీపెట్టెను వినియోగించి పాస్‌పోర్టుకు అంటించి అది చిరగకుండా వీసా స్టిక్కర్‌ను తొలగించి ..ఇంక్ రిమూవర్‌తో మిగిలిన స్టాంప్‌ను తుడిచేసి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఎంప్లాయిమెంట్ వీసా మీద వెళ్లాలంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం కువైట్‌లో ఉద్యోగం ఇచ్చే యజమాని ప్రవాసీ భారతి బీమా యోజన కింద రూ.1,50,000 వరకు ఉద్యోగిపై ఇన్సూరెన్స్ కట్టినట్లు రుజువు చూపాలి.ఉద్యోగ ఒప్పంద పత్రం తనిఖీ చేస్తారు. వీటినుంచి తప్పించుకునేందుకు ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’మార్గాన్ని ఎంచుకున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ బుధవారం మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి 250 పాస్‌పోర్టులు, నకిలీ వీసాలు, రబ్బర్ స్టాంప్‌లు, 160 పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లతో పాటు రూ.ఐదు లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్క మార్చి నెలలోనే నకిలీ వీసాలపై ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో పది కేసులు నమోదైనట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్ గుర్తించినట్లు తెలిపారు. జనవరి నుంచి 14 కేసులు నమోదైతే 71 మందిని అరెస్టు చేశామన్నారు. – సాక్షి, హైదరాబాద్ మెడికల్ ఫిట్ ఉంటే హైదరాబాద్ నుంచే... హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉంటున్న నెల్లూరు జిల్లా కలువాయిమండలం వెంకటరెడ్డి పాలెం గ్రామానికి చెందిన తోట కంఠేశ్వర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ముఠా కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని కువైట్‌లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. వీరికి విదేశాలకు పంపించే అనుమతి లేకపోవటంతో ముంబై, బెంగళూరు, శ్రీలంకలోని లీగల్ ఏజెంట్లను కలసి ఎంప్లాయిమెంట్ వీసాలు తెప్పిస్తున్నారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో రూ.135లు ఫీజు చెల్లించి చేవెళ్ల చిరునామాలు ఇస్తుండటంతో అక్కడి పోలీసు కానిస్టేబుల్ జి.మధు రూ.2,500లు తీసుకొని క్లియరెన్స్ ఇచ్చేవాడు.ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం ఎస్ఎస్సీ చదువుకోని వారు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) క్లియరెన్స్‌ను తప్పించుకునేందుకు ఎంప్లాయిమెంట్ వీసా స్థానంలో నకిలీ విజిట్ వీసాను కంప్యూటర్లో ఫొటోషాప్ ద్వారా మారుస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయాల ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తీసుకొని ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’వినియోగించి నకిలీ విజిట్ వీసాను సిద్ధం చేసేవారు. నెలరోజుల విజిట్ వీసాతో పాటు నకిలీ తిరుగు ప్రయాణ టికెట్లను గల్ఫ్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి మహమ్మద్ ముజీబ్ ఖాన్, ఒమన్ ఎయిర్ ఉద్యోగి అనప్ప రెడ్డి రామలింగారెడ్డి సమకూర్చి సహకరిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు చెందిన పలువురిని కువైట్‌కు పంపించినట్టు తేలింది. ఈ ముఠా సభ్యులైన తోట కంఠేశ్వర్, సురేందర్, నర్సింహ, అనిల్ కుమార్, యుగంధర్, వినయ్ కుమార్, వెంకటసుబ్బారాయుడులను పోలీసులు అరెస్టు చేశారు.చేవెళ్ల పోలీసు కానిస్టేబుల్ మధును కూడా అరెస్టు చేశారు. ఇతర పోలీసుల పాత్రపైనా ఆరా తీస్తున్నామని సీపీ సజ్జనార్‌తెలిపారు. మెడికల్ అన్‌ఫిట్ అయితే శ్రీలంక నుంచి... హైదరాబాద్‌లోని ఆరు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించే ఈ ముఠా ఫిట్ ఉంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆశ్రితులను కువైట్‌కు పంపించేవారు.ఎవరైనా అన్‌ఫిట్ అని తేలితే ట్రాన్సిట్ పాస్‌పోర్టుపై ఏడు రోజుల వీసాతో శ్రీలంకకు పంపించే బాధ్యతను 8 మంది సభ్యులతో కూడిన పుష్ప అనే ఆమె నేతృత్వంలోని మరో ముఠా చూసుకునేది. ఈ ముఠాలో ఉన్న ఏపీకి చెందిన గెడ్డం శశి, చింతల సాయిరామ్‌కుమార్, షేక్ అక్రమ్, పిల్లి శ్రీకర్, అకరం బాలకృష్ణ, షేక్ ఖాదర్ బాషా, పూసపాటి రామకృష్ణ, విజయభాస్కర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడ్డ నిందితులు ఇలా చేస్తే మేలు... విదేశాల్లో పనిచేసేందుకు వెళ్లేందుకు రిజిస్టర్డ్ ఏజెంట్ల కోసం ఇమిగ్రేట్.జీవోవీ.ఇన్‌లో తెలుసుకోవాలి. నాంపల్లిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీసులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వివరాలు నమోదుచేసుకుంటే విదేశాలలో మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.అక్కడ పనిచేసే ప్రాంతంలో వేధింపులకు గురికాకుండా అక్కడి భారత ప్రభుత్వ రాయబార కార్యాలయం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎవరైనా ఏజెంట్లు మాయమాటలు చెప్పి పాస్‌పోర్టులు, డబ్బులు తీసుకుంటే వాటిని వెనక్కి తీసుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. -
నేరాలకు వీసా!
దేశంలోని మెట్రో నగరాలపై ఇరానియన్లు కన్నేశారు. ఓ కుటుంబంగా విజిట్ వీసాపై వస్తున్నారు. ఢిల్లీలోని లాడ్జిలు, హోటళ్లలో బస చేస్తున్నారు. అక్కడే ఓ వాహనం అద్దెకు తీసుకుని ప్రధాన మెట్రో నగరాల్లో సంచరిస్తున్నారు. ఓ సిటీకి చేరిన తర్వాత రాత్రికి బస చేయడం, ఉదయం దృష్టి మళ్లించి డబ్బు కాజేసే నేరం చేయడం పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సహా ఐదు నగరాల్లోని మనీ ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్ సంస్థల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల ఓ ముఠాను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో రెండింటి కోసం గాలిస్తున్న పోలీసులు ఆ అరెస్టు వివరాలను గోప్యంగా ఉంచారు. –సాక్షి, హైదరాబాద్ ‘స్థానిక ముఠాలు’ ఇచ్చిన సమాచారంతో... కొన్నేళ్ల క్రితం ఇరాన్ నుంచి వలస వచ్చి దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరిలో కొందరు నేరగాళ్లుగానూ మారారు. ప్రధానంగా కర్ణాటకలోని బీదర్, ధర్వాడ, మహారాష్ట్రలోని థానే సమీపంలో ఉన్న అంబివలీ, మధ్యప్రదేశ్‌తో పాటు రాష్ట్రంలోని గుంతకల్, మదనపల్లిలో ఉంటూ నేరాలు చేస్తున్నాయి. పోలీసుల అవతారం ఎత్తి తనిఖీల పేరుతో మహిళల నుంచి నగలు తదితరాలు కాజేసేవాళ్లు. ఆ తర్వాతి కాలంలో ఈ ముఠాలు అటెన్షన్ డైవర్షన్స్గా పిలిచే దృష్టి మళ్లించి సొత్తు కాజేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. నాలుగేళ్ల క్రితం వరకు హైదరాబాద్‌పైనా వరుసపెట్టి పంజా విసిరారు. అటెన్షన్ డైవర్షన్ నేరాల గురించి తెలుసుకున్న ఇరాన్‌లోని వీరి బంధువులు టూరిస్ట్ వీసాపై వస్తున్నారు. విమాన టికెట్లు, ఇతర ఖర్చులు కలిపి రూ.1.5 లక్షలకు మించి కాకపోవడంతో అనేక ముఠాలు వచ్చి పంజా విసరడం మొదలెట్టాయి. ఒంటరిగా విజయవంతం కావడంతో ముఠా... ఇరాన్‌కు చెందిన బర్జిగరేసికా బెటేకల్మార్జీ అహ్మద్ కొన్నాళ్ల క్రితం విజిట్ వీసాపై వచ్చి అటెన్షన్ డైవర్షన్ నేరాలు చేసి వెళ్లాడు. మళ్లీ గత ఏడాది జూలైలో జెరేహ్దౌస్త్ కమ్రాన్, పహంఘే అలీ అతడి భార్య పహంగే మీనతో కలసి వచ్చాడు. తామంతా ఓ కుటుంబమని, విహారయాత్రకు వచ్చామంటూ చెప్పారు. ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేసిన వీరు అక్కడ నుంచి ఓ వాహనాన్ని రోజుకు రూ.2,300 అద్దెకు తీసుకున్నారు. దీనిపై ఒక్కో మెట్రో నగరానికి వెళ్లి రాత్రి బస చేసేవారు. అదే పూట మనీ ట్రాన్స్ఫర్, మనీ ఎక్సే ్చంజ్ సంస్థలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేవారు. మరుసటి రోజు ఆయా దుకాణాలకు సూటుబూటుతో వెళ్లి నిర్వాహకుల దృష్టి మళ్లించి క్యాష్ కౌంటర్లోని డబ్బు పట్టుకుని ఉడాయించేవారు. ఈ ముఠా అహ్మదాబాద్, షోలాపూర్, ముంబై, పుణేల్లో ఈ తరహా చోరీలు చేసింది. ఓ ప్రాంతంలో ఒక రోజు ఒక నేరం చేసి వెంటనే ఆ నగరాన్ని వదిలేస్తారు. మరో మెట్రో సిటీకి వెళ్లి తమ వద్ద ఉన్న డబ్బులో వీలైనంత హవాలా మార్గంలో తమ దేశానికి పంపించి కొంతే దగ్గర ఉంచుకుంటారు. ఎవరైనా తనిఖీలు చేసినా అనుమానం రాకుండా తమ వద్ద ఉన్న దాన్ని ఇరాన్ కరెన్సీగా మార్చేసుకుంటారు. పుణే మార్గంలో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్... ఈ గ్యాంగ్ గత ఏడాది ఆగస్టు 27న హైదరాబాద్ వచ్చి ఆ మరునాడు మాదన్నపేటలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో నేరం చేసింది. యజమాని దృష్టి మళ్లించి రూ.2 లక్షలతో ఉడాయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం చేసిన వెంటనే ఇరానీ ముఠా నగరం విడిచిపెట్టాల్సి ఉంది. అయితే కాలకృత్యాల కోసం పాతబస్తీలోని ఓ షాపునకు వెళ్లి అవకాశం చిక్కడంతో క్యాష్ కౌంటర్లోని డబ్బు కాజేసింది. మాదన్నపేట కేసును పర్యవేక్షిస్తున్న పోలీసులకు ఈ విషయం తెలిసి ఆ దుకాణం వద్దకు వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి దుండగులు వాడిన వాహనం నంబర్ గుర్తించారు. దాని యజమానిని సంప్రదించగా.. ఇరాన్ నుంచి వచ్చిన కుటుంబానికి అద్దెకు ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో సాంకేతికంగా కదలికలు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులు పుణే మార్గంలో ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 3న అక్కడకు వెళ్లిన టీమ్ నలుగురిని పట్టుకోవడంతో కథ వెలుగులోకి వచ్చింది. ఎంబసీ సాయం తీసుకోవాలనే యోచన.. ఈ గ్యాంగ్‌ను విచారించగా ఆ పని తాము చేయలేదని, తమ మాదిరిగానే మరో రెండు ముఠాలు సంచరిస్తున్నాయని వెల్లడించారు. వీరు అరెస్టు అయినట్లు బయటకు వస్తే ఆ ముఠాలు అప్రమత్తం అవుతాయనే ఉద్దేశంతో విషయాన్ని గోప్యంగా ఉంచారు. మిగిలిన రెండు ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు అవసరమైతే ఎంబసీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అహ్మద్ గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చారు. వీసా వివరాలను తీసుకుని సమగ్రంగా అధ్యయనం చేస్తే ఇరాన్ నుంచి వచ్చిన ముఠాలెన్ని అనేది తెలుస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. ‘ఈ తరహా ముఠాలు చేస్తున్న నేరాల్లో అనేకం అనివార్య కారణాల నేపథ్యంలో పోలీసుల వరకు రావట్లేదు. ఆదాయపు పన్ను, జీఎస్టీ ఇలాంటి అనేక అంశాలతో వ్యాపారులు ఫిర్యాదులకు వెనుకాడుతున్నారు. ఫలితంగా కొన్నాళుగా ఈ ముఠాల ఆగడాలు హద్దూ్ద అదుçపూ లేకుండా సాగిపోతున్నాయ’ని ఆయన వివరించారు. -
మలేషియా ఉద్యోగాల పేరుతో మోసం
నిజామాబాద్ : మలేషియాలో 10 మంది నిజామాబాద్ వాసులు ఇరుక్కుపోయారు. ఓ గల్ఫ్ ఏజెంట్, రూ.35 వేలు జీతం అని చెప్పి విజిట్ వీసాలతో పది మందిని మలేషియా పంపించాడు. మలేషియాలో తిండీ గూడు లేక తిరిగొచ్చేందుకు డబ్బులు నరకయాతన పడుతున్నారు. బాధితుల స్వస్థలం బాల్కొండ మండలం జక్రాన్ పల్లి. రూ.60 వేలు కట్టబెట్టి వచ్చినా నిలువునా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వాట్సప్ వీడియోల ద్వారా బంధువులకు, స్నేహితులకు సమాచారం పంపారు. ఈ సమాచారం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
చేయని తప్పుకు ఇరాక్ జైల్లో..
ధర్మపురి: కుటుంబ పోషణ కోసం పరాయి దేశం వెళ్లిన ఐదుగురు రాష్ట్ర వాసులు ఏజెంట్ల మోసంతో జైలుపాలై.. చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఏ తప్పు చేయని వీరు ఇరాక్‌లో ఏడాదిపాటు జైల్లో నరకయాతన అనుభవించారు. ఇందులో ముగ్గురు ఎట్టకేలకు విడుదలై మంగళవారం స్వగ్రామాలకు చేరుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ అనుబంధ గ్రామం మగ్గిడికి చెందిన దుర్గం శాంతయ్య, పసుల లక్ష్మణ్, జక్కి రాజుతోపాటు మంచిర్యాల జిల్లా దండెపెల్లి మండలానికి చెందిన కోడి రాజన్న, నిర్మల్ జిల్లాకు చెందిన దుర్గం నారాయణ బతుకుదెరువుకోసం 2016, జూన్ 17న ఇరాక్ వెళ్లారు. ఇందుకోసం ధర్మపురికి చెందిన ఓ ఏజెంట్‌కు రూ.1.40 లక్షలు ఇచ్చారు. ఆ ఏజెంట్ కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసాపై ఈ ఐదుగురినీ ఇరాక్ పంపించాడు. ఏడాదికి రూ.లక్ష వేతనం ఉంటుందని నమ్మించాడు. అయితే అక్కడికి వెళ్లాక పరిస్థితి మారింది. అక్కడ ఓ కంపెనీలో ఆరునెలలపాటు నెలకు కేవలం 400 దినార్ల వేతనంతో పనిచేశారు. వేతనం చాలకపోవడంతో అక్కడ మరో ఏజెంట్‌ను కలిశారు. ఎక్కువ వేతనం వచ్చే కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తానని సదరు ఏజెంట్ చెప్పడంతో వీరు ఇంటి నుంచి మరో రూ.1.30 లక్షలు తెప్పించి ఆ ఏజెంట్‌కు ఇచ్చారు. అయితే అతడు ఉద్యోగం చూపకపోవడంతో కొంతకాలం అతని చుట్టూ తిరిగారు. చివరకు విధిలేని పరిస్థితిలో 2017, మే 14న ఇంటికి తిరుగు ముఖం పట్టారు. నకిలీ వీసాగా గుర్తించి జైలుకు.. ఏజెంట్లను నమ్మి వారికి ఒక్కొకరు రూ.2.70 లక్షలు ముట్టజెప్పినా ఫలితం లేకపోవడంతో ఇంటికి బయల్దేరిన వలస బాధితుల వీసాలను అక్కడి విమానాశ్రయంలో తనిఖీ చేయగా, అవి విజిట్ వీసాలు అని తేలింది. గడువు ముగిసిన తర్వాత కూడా ఇరాక్‌లో ఉన్నందుకు పోలీసులు ఐదుగురినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మే 14 నుంచి సుమారు 10 నెలలు జైల్లో నరకం చూశామని బాధితులు తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమ వద్ద ఉన్న సెల్ఫోన్లు, బ్యాగులు, ఇంటికి తీసుకొచ్చేందుకు కొనుగోలు చేసిన సుమారు 60 వేల విలువైన వస్తువులను కూడా అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తాము శిక్ష అనుభవిస్తున్నామని అక్కడివారి ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమను విడిపించుకునేందుకు అనేక పాట్లు పడ్డారని బాధితులు తెలిపారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను కూడా కలవడానికి ఢిల్లీ వెళ్లారని, మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులను కలసి వినతిపత్రాలు అందించారని వివరించారు. తమ కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు విముక్తి కలిగిందన్నారు. జక్కి రాజు, దుర్గం నారాయణ మరో 15 రోజులకు స్వగ్రామానికి వస్తారని తెలిపారు. జైల్లో నరకం చూశా పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లిన మమల్ని జైల్లో బంధించారు. జీతం చాలక ఇంటికి వచ్చేముందు ఎయిర్‌పోర్టులో వీసాలు చూసి జైలుకు పంపించారు. పది నెలలు జైల్లో నరకం చూశాం. కటుంబం ఎట్లుంటదో తెలియదు. ఏజెంటు చేసిన మోసానికి బలయ్యాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పసుల లక్ష్మణ్, మగ్గిడి -
ఇంటికి రాలేక... గల్ఫ్‌లో ఉండలేక
హైదరాబాద్‌లో మకాం... ► దొరికిన పనులు చేసుకుంటున్న వైనం ► విజిట్ వీసాలతో ఏజెంట్ మోసం ► పోలీసులకు బాధితుల ఫిర్యాదు కోరుట్ల: ‘నాతోపాటు 40 మందిని ఏప్రిల్‌లో ఏజెంట్ దుబాయ్ పంపిండు.. అక్కడ నెల రోజులు ఉంచుకుని పనులు లేవని తిప్పి పంపిండ్రు.. ఇంటికి వెళ్లడానికి మొహం చెల్లక హైదరాబాద్‌లోనే ఉండి దొరికిన పనులు చేసుకుంటున్నం. ఏజెంట్ మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు’ కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన అందె సతీశ్(25) ఆవేదన ఇదీ. సతీశ్‌తోపాటు మరో ముగ్గురు యువకులు ఆదివారం గల్ఫ్ ఉద్యోగాల ఎరతో తాము మోసపోయిన వైనంపై కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంభీర్పూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ కాల్వ శేఖర్ దుబాయ్‌లోని మైక్రో సీజన్స్ సప్లయ్స్ క్యాటరింగ్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో జగిత్యాల జిల్లా కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, మెట్పల్లి, గొల్లపల్లి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా ఖమ్మం, విజయవాడ ప్రాంతాల నుంచి 40 మంది ఒక్కొక్కరు రూ.50 వేలు అతనికి చెల్లించారు. వారిని వారం రోజుల వ్యవధిలో ఏప్రిల్‌లో దుబాయ్ పంపాడు. తమను నెల రోజుల విజిట్ వీసాలతో అక్కడి పంపాడని బా«ధితులు సతీశ్, తిరుపతి, రమేశ్, ఏలేటి కుమార్ చెప్పారు. దుబాయ్ తమకు రెండు రూంలు కేటాయించారని, ఒక్కో రూంలో 15–20 మంది వరకు సర్దుకుని నానా తిప్పలు పడ్డామన్నారు. అక్కడ కంపెనీలో సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి వద్ద 1,500 దర్హామ్‌లు(రూ.25 వేలు) తీసుకున్నారన్నారు. నెల గడువు ముగియడంతో తాము అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందనీ, ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని తిరిగి ఇండియాకు వచ్చామన్నారు. దుబాయ్ వెళ్లిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన అక్రం, విజయవాడకు చెందిన రఫీ ఇంటికి తిరిగివెళ్లలేక హైదరాబాద్‌లోనే ఉండి పనిచేసుకుంటున్నట్లు తెలిసింది. మరో ముగ్గురు యువకులు హైదరాబాద్‌లోనే పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. తాము దుబాయ్ వెళ్లి మోసపోయామన్న విషయం తెలిస్తే.. ఇంటి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన గురవుతారన్న ఆవేదనతో దొరికిన పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిసింది. ఉపాధి పేరిట తమను మోసగించిన ఏజెంట్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బా«ధితులు సతీష్, రమేష్, తిరుపతి, కుమార్ కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుతో ఆదివారం మొరపెట్టుకున్నారు. -
జరిమానా చెల్లిస్తేనే ఇంటికి...
ఇరాక్‌లో తెలుగుకార్మికుల ఇక్కట్లు మోర్తాడ్: పొట్ట చేత పట్టుకొని ఇరాక్‌లో పని కోసం వెళ్లిన కార్మికులు ఏజెంట్ల మోసాలతో పడరాని పాట్లు పడుతున్నారు. ఇరాక్‌లో పని చేయడానికి తెలంగాణ జిల్లాల్లోని పలువురు కార్మికులు ఆసక్తి చూపగా వారిని అక్కడికి పంపించిన ఏజెంట్లు వర్క్ వీసాలకు బదులు విజిట్ వీసాలు చేతిలో పెట్టారు. అప్పులు చేసి ఇరాక్ వెళ్లిన కార్మికులు విజిట్ వీసా గడువు ముగిసిపోగా ఇంటికి రాకుండా పనిచేస్తూ అక్కడే ఉండిపోయారు. అక్రమంగా ఉంటు న్నవారిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగడంతో కార్మికుల్లో గుబులు పట్టుకుంది. విజిట్ వీసాపై వెళ్లినవారికి పని ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రాకపో వడంతో తప్పనిసరిగా ఇంటికి రావాల్సి వస్తోం ది. ఈ క్రమంలో తిరిగి వచ్చేందుకు అవస రమైన ఔట్ పాస్ పోర్టులను జారీ చేసేందుకు ఇరాక్ ప్రభుత్వం రెండు వేల డాలర్ల జరి మానా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో 400 డాలర్లు జరిమానా ఉండగా, ఇప్పుడు దానిని పెంచడంతో అక్కడి తెలంగాణ కార్మికుల పరిస్థితి దిక్కుతోచకుంది. ఇరాక్‌లో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, మంచిర్యాల్, కామారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది కార్మికులు ఇరాక్‌లో అక్రమంగా ఉన్నారు. వారిలో 33 మంది తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బసంత్ రెడ్డి చొరవతో ఇటీవల ఇంటికి చేరుకున్నారు. విదేశాంగ శాఖ, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌తో చర్చించి జరిమానా లేకుండా ఇంటికి రప్పిం చారు. మిగిలిన కార్మికులను కూడా ఇలాగే తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని బాధితులు కోరుతున్నారు. -
బహ్రెయిన్‌లో క్షమాభిక్ష అమలు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి ఊరట సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): బహ్రెయిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష అమలు చేస్తోంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్షమాభిక్షకు గడువు విధించింది. బహ్రెయిన్‌కు విజిట్ లేదా కంపెనీ వీసాలపై వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉన్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన క్షమా భిక్షతో ఊరట లభించనుంది. కంపెనీ వీసాలపై వెళ్లి పని నచ్చకపోవడంతో ఎంతో మంది కార్మికులు ఇతర కంపెనీల్లో చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారు. బహ్రెయిన్‌లో అలాంటి తెలంగాణ కార్మికులు ఆరు వేల మందికి పైగా ఉంటారని అంచనా. ప్రభుత్వం అమలు చేయనున్న క్షమాభిక్షతో కార్మికులకు తమ చేతిలో పాస్‌పోర్టు లేకపోతే లేబర్ మానిటరింగ్ రిక్రూట్మెంట్ అథారిటీ(ఎల్ఎంఆర్ఏ)కి దరఖాస్తు చేసుకోవాలి. వారు కొత్త పాస్‌పోర్టును మన దేశ విదేశాంగ శాఖ ద్వారా జారీ చేయించి కంపెనీ ల్లో పని కల్పిస్తారు. ఒక వేళ పని చేయడం ఇష్టం లేకపోతే, జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా జైలుకు పోకుండా ఇంటికి చేరుకోవచ్చు. చేతిలో పాస్‌పోర్టు ఉం డి వీసా గడువు ముగిసినవారికి ఎల్ఎంఆర్ఏ కొత్త వీసాలను జారీ చేయిస్తుంది. ఆరు నెలల కాలంలో వారు పట్టుబడినా జైలు శిక్ష ఉండదు. బహ్రెయిన్ ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ ఆరు నెలల కాలం దాటితే మాత్రం అక్కడి ప్రభుత్వం కఠిన శిక్షలను అమలు చేయనుంది. క్షమాభిక్షతో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం దొరికిందని అక్క డి స్టార్ హోటల్లో పని చేస్తున్న తిమ్మాపూర్‌కు చెందిన రామ్మోహన్ తెలిపారు. -
మలేసియాలో కొనసాగుతున్న అరెస్టులు
230 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోర్తాడ్: మలేసియా దేశానికి విజిట్ వీసాపై వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని పట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తాజాగా సోమవారం రాత్రి కూడా అక్కడి వివిధ పట్టణాల్లో దాడులు జరిపిన పోలీసులు 230 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు పలువురు ‘సాక్షి’కి ఫోన్లో సమాచారం అందించారు. విజిట్ వీసాల గడువు ముగిసిన విదేశీయులు తమ దేశం విడిచి వెళ్లిపోవాలని, ఇందుకు తగిన సహకారమందిస్తామని మలేసియా ప్రభుత్వం మూడు నెలల క్రితం ప్రకటించింది. అయితే, అక్కడ పని చేయడం కోసం ఏజెంట్లకు లక్షల రూపాయల సొమ్ము చెల్లించిన వేలాది మంది తెలుగువారు అక్కడే ఉండిపోయారు. వివిధ కంపెనీలలో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. అయితే ఏజెంట్ల మోసంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు అక్రమంగా ఉండిపోయారు. తెలిసినవారి గదుల్లో తలదాచుకుంటూ, ఎక్కడ దొరికితే అక్కడ పని చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఇంటికి రావాలంటే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఒకే రోజున 230 మందిని అరెస్టు చేయడంతో తెలుగువారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
క్షణక్షణం...ప్రాణభయం
క్షణక్షణం.. ప్రాణభయం ఇరాక్‌లో మనోళ్లు..సహాయక చర్యలు ప్రారంభం హెల్ప్‌లైన్‌కు11 మంది కుటుంబీకుల గోడు స్థానికులను నిర్ధారించాలనిజిల్లా యంత్రాంగానికి సర్కారు ఆదేశం అసలే పరాయి దేశం.. ఆపై మారణహోమం.. ప్రాణాపాయం నుంచి బయటపడాలనే తపన.. క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆశతో జిల్లాకు చెందిన వందలాది మంది ఇరాక్‌లో బిక్కుబిక్కుమంటున్నారు. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. ఇరాక్‌లో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో మన జిల్లావాసులు బాధితులుగా మారారు. - కలెక్టరేట్ - అధికారిక వీసాలతో వెళ్లి వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారిని అక్కడి ప్రభుత్వం పనులకు వెళ్లనీయకుండా జాగ్రత్త చర్యలు ఇప్పటికే చేపట్టింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వాసులను రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే విజిట్ వీసాలపై వెళ్లినవారు, వీసా గడువు ముగిసినప్పటికీ ఇరాక్‌లో తలదాచుకుని ఉపాధి పొందుతున్న వారు ఇక్కడికి రాలేక.. అక్కడ ఉండలేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజులుగా సెల్‌ఫోన్, ఇతర సమాచార వ్యవస్థ స్తంభించడంతో వారి సంబంధీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు జిల్లాకు చెందిన పదకొండు మంది కుటుంబసభ్యులు ఫోన్ చేసి తమ వారిని కాపాడాలని, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. వీరంతా అక్కడ కల్లివెల్లి అయి (అక్రమంగా ఉంటున్నవారు) పని చేస్తున్న వారేనని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా ఆ పదకొండు మంది జిల్లాలోని స్థానికులా.. కాదా.. నిర్దారించాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎన్వీ.రమణారెడ్డి జిల్లా యంత్రాంగానికి ఫ్యాక్స్ ద్వారా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా అక్కడి ఇరాక్ ఎంబసీని సంప్రదించి సహాయక చర్యలు చేపట్టే వీలుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ సాధారణ పరిపాలనా (ఎన్ఆర్ఐ) విభాగం నుంచి ఫ్యాక్స్ ద్వారా పదకొండు మంది పేర్లు, చిరునామా, పాస్‌పోర్టు నంబర్, సంబంధీకుల ఫోన్ నంబర్లతో సహా కలెక్టరేట్‌కు సమాచారం ఇచ్చి వెంటనే స్పందించాల్సిందిగా కోరింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సంబంధిత తహసీల్దార్లకు వివరాలను అందజేసి స్థానికులా.. కాదా నిర్ధారించాలని ఆదేశించడంతో అధికారులు రాత్రి హడావుడిగా ఆ పనిలో నిమగ్నమయ్యారు . జిల్లావాసులు నాలుగు వందల మంది పైనే.. ఇరాక్‌లో ఉపాధి కోసం వలస వెళ్లిన జిల్లావాసులు నాలుగు వందల మంది పైనే ఉంటారని తెలుస్తోంది. ఒక్క వేములవాడలోనే 107 మంది ఇరాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాక్ దేశంలోని సిరియా, బాస్రా, మన్సూరియా, బాగ్దాద్, ప్రాంతాల్లో ఉపాధి పొందుతుండగా వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులకు సాయమందించడంతో పాటు వారిని తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆయా మండలాల వారీగా వివరాల సేకరణలో నిమగ్నమయ్యింది. 600ల మందిమి ఉన్నం.. ఇరాక్‌లోని అలవ్ కంపెనీలో వివిధ దేశాలకు చెందిన 600ల మందిమి ఉంటున్నం. ఎప్పుడు ఏమవుతుందో తెలుత్తలేదు. ప్రస్తు తం బస్రాలోని క్యాంపులో తలదాచుకున్నం. కంపెనీ యాజమాన్యం ఇప్పటికీ ఎటూ తేల్చలేకపోతోంది. - సల్వాజి నాగేందర్, కోనరావుపేట మండలం నిజామాబాద్