మోర్తాడ్ (బాల్కొండ): బహ్రెయిన్ దేశం విజిట్ వీసాల నిబంధనలను కఠినతరం చేసింది. తమ దేశానికి విజిట్ వీసాలపై వచ్చిన వారు గడువు ముగిసిపోయినా ఇంకా ఉండిపోతున్నారని బహ్రెయిన్ ప్రభుత్వం గుర్తించింది. గతంలో విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లేవారు డమ్మీ రిటర్న్ టికెట్‌ను చూపేవారు. రిటర్న్ టికెట్ విషయంలో ఇప్పటివరకు బహ్రెయిన్ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు.
అయితే తాజా నిబంధనల ప్రకారం ఇప్పుడు పక్కాగా కొనుగోలు చేసిన రిటర్న్ టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. అంటే విజట్ వీసాపై వచ్చినవారు కచ్చితంగా వెనక్కు వెళ్లిపోవాలి. విజిట్ వీసాలపై వచ్చిన వారు ఏ హోటల్‌లో బస చేస్తున్నారో ఆ హోటల్‌లో గదులను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇవేమీ పట్టించుకునేవారు కాదు. విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లేవారు మన కరెన్సీలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు దినార్‌లుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు కనీసం 50 దినార్లు ఖర్చు చేయాలి.
విజిట్ వీసాలపై వచ్చినవారు కేవలం పర్యాటక ప్రాంతాలను చూసి తిరుగు ప్రయాణం కావాలి. ఇప్పటివరకు అనేక మంది విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉంటూ ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం దక్కించుకుంటూ ఉండిపోతున్నారు. ఇలా అక్రమంగా ఉంటున్నవారి సంఖ్య పెరిగిపోవడంతో వారి సంఖ్యను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దీంతో తొలుత విజిట్ వీసాల నిబంధనల్లో మార్పులు చేసింది. (క్లిక్ చేయండి: యాదాద్రి ప్లాంట్‌కు ‘పర్యావరణ’ కష్టాలు!)
Comments
Please login to add a commentAdd a comment