
ఉగ్రవాదులు జ్ఞానులే: హోం మంత్రి
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదులను 'జ్ఞానులు'గా సంబోధించారు. వాళ్లు తమకున్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే నిర్మాణాత్మక పనుల కోసం ఉపయోగించేందుకు వాళ్లు కూడా యోగా చేయాలని సూచించారు.
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదులను 'జ్ఞానులు'గా సంబోధించారు. వాళ్లు తమకున్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే నిర్మాణాత్మక పనుల కోసం ఉపయోగించేందుకు వాళ్లు కూడా యోగా చేయాలని సూచించారు. యోగా ప్రయోజనాలను అందరికీ చెప్పేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగాతో మనుషుల వ్యక్తిత్వం కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
జ్ఞానం చాలా ప్రమాదకరమని కూడా రాజ్నాథ్ చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఉండేవాళ్లు కూడా జ్ఞానులేనని, వాళ్లకు బోలెడంత విజ్ఞానం ఉందని ఆయన అన్నారు. అయితే, వాళ్ల విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగించేలా వాడాలి తప్ప వినాశనానికి కాదని సూచించారు. వాళ్ల జ్ఞానాన్ని నియంత్రించే శక్తి యోగాకు ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వివాదం చేయొద్దని వివిధ రాజకీయ పార్టీలకు హోం మంత్రి సూచించారు. యోగ మన సంస్కృతి అని, మనమంతా దానిపట్ల గర్వంగా ఉండాలని చెప్పారు. రాజ్పథ్ వద్ద జరిగే కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పాల్గొంటారని అంచనా.