చైనా, మలేసియా, కొరియాలపై కేంద్రం అస్త్ట్రం
దేశీయ పరిశ్రమను కాపాడే లక్ష్యం
న్యూఢిల్లీ : చైనా, మలేసియా, కొరియా నుంచి కొన్ని స్టీల్ ప్రొడక్టుల దిగుమతులపై కేంద్రం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. దేశీయ పరిశ్రమను కాపాడే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ చర్య తీసుకుంది. టన్నుకు 316 డాలర్ల వరకూ యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ మార్కెట్‌కన్నా తక్కువ ధరకు కొన్ని స్టీల్ ప్రొడక్టుల దిగుమతులు, వాటిలోనూ కొంత నాణ్యత కొరవడటం వంటి కారణాలు ఈ సుంకాల విధింపునకు కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
వివరాలు క్లుప్తంగా...
చైనా నుంచి దిగుమతులపై టన్నుకు 309 డాలర్లు, మలేషియా నుంచి దిగుమతులపై టన్నుకు 316 డాలర్లు సుంకాలు విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. కొరియా విషయంలో ఈ విలువ 180 డాలర్లుగా ఉంది.
ఆటో వంటి రంగాల్లో వినియోగించే స్టెయిన్‌లెస్ స్టీల్ హాట్ రోల్డ్ ఫ్లాట్ ఉత్పత్తులపై ఐదేళ్లు యాంటీ-డంపింగ్ సుంకం అమలవుతుంది. ఈ స్టీల్ ప్రొడక్టులను ఆటోతోపాటు తయారీ రంగం, రియాక్టర్ వెసల్స్, మెటీరియల్ హ్యాం డ్లింగ్ ఎక్విప్‌మెంట్, రైల్వే లు, పైపులు, ట్యూబ్స్, ఆర్కిటెక్చర్, భవన- నిర్మా ణం, ఇండస్ట్రియల్ ఫ్యాబ్రికేషన్, విద్యుత్ రంగాల్లో వినియోగిస్తారు.
హర్షణీయం.. ఐఎస్‌ఎస్‌డీఏ: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండియన్ స్టెయిన్‌లెస్ స్టీల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐఎస్‌ఎస్‌డీఏ) హర్షం వ్యక్తం చేసింది. చౌక స్టీల్ దిగుమతుల వల్ల దేశీయ స్టెయిన్‌లెస్ స్టీల్ పరిశ్రమ బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు.
స్టీల్ దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకం
Published Mon, Jun 8 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM
Advertisement