
ద్రోన్ దాడుల్లో ఐఎస్ అగ్రనేత హతం
తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వైమానిక దళాలు జరిపిన ద్రోన్ దాడుల్లో అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ పరిధిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) అధినేత హఫీజ్ సయీద్ మరణించినట్టు నిఘా అధికారులు నిర్ధారించారు.
హఫీజ్ సయీద్తో పాటు ఐఎస్తో సంబంధం ఉన్న మరో 30 మంది మరణించినట్టు నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యురిటీ, అఫ్ఘనిస్తాన్ నిఘా అధికారులు శనివారం ధృవీకరించారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ తాలిబన్ గ్రూప్ నుంచి ఐస్లోకి వచ్చి చేరిన మరో నేత షాహిదుల్లా షాహిద్ కూడా మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్లోనే హాఫీజ్ బాంబు పేలి మరిణించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.