
పాలమూరులో ఎమ్మెల్యేల డిష్యుం డిష్యుం
మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడటంతో వివాదం మొదలైంది. అయితే తర్వాత కాసేపటికి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గూ శరం లేవని వ్యాఖ్యానించడంతో వివాదం కాస్తా తారస్థాయికి చేరుకుంది.
ఓ దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు చెంపదెబ్బ కొట్టడంతో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే బాలరాజు జడ్పీ ఛైర్మన్ పోడియం వద్ద బైఠాయించారు. తనను కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.