'బాబు గల్ల పట్టుకోకుండా సర్కార్‌పై విమర్శలా' | TRS mlas to blame chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబు గల్ల పట్టుకోకుండా సర్కార్‌పై విమర్శలా'

Published Mon, Aug 10 2015 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

TRS mlas to blame chandrababu naidu

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గల్లపట్టుకుని ప్రశ్నించకుండా తెలంగాణ టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతూ చంద్రబాబు లేఖలు రాశారని, మరోవైపు టీ టీడీపీ నేతలు పాద యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారిద్దరూ సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వకుండా, సూచనలు చేయకుండా విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. కేవలం తమ ఉనికి చాటుకోవడానికే ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవాలు దాచిపెట్టి పాదయాత్రలు చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వీరికి తోడు మరో వైపు కాంగ్రెస్ నాయకులు కూడా వాస్తవాలు మరిచిపోయి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయి తట్టుకోలేక పోతున్న కాంగ్రెస్ నేతలు , మరి తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement