జార్ఖండ్‌లో చిన్నారి నరబలి | Two Men Sacrifice Seven-Month-Old Girl in Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో చిన్నారి నరబలి

Published Sat, Jun 3 2017 7:59 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

జార్ఖండ్‌లో చిన్నారి నరబలి

జార్ఖండ్‌లో చిన్నారి నరబలి

జంషెడ్‌పూర్‌: సంతానం కోసం మంత్రగాడి మాటలు విని ఏడు నెలల చిన్నారిని నరబలి ఇచ్చాడో వ్యక్తి. జార్ఖండ్‌లోని సెరైకేలా–ఖర్స్వాన్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బదోయ్‌ కాళింది అనే వ్యక్తి పాములు ఆడిస్తూ జీవిస్తున్నాడు. సంతానం లేకపోవడంతో తాంత్రికుడైన కర్మూను ఆశ్రయించాడు. పిల్లలు పుట్టాలంటే నరబలి ఇవ్వాలని  కర్మూ చెప్పాడు.

మే 26 రాత్రి కర్మూ... బదోయ్‌తో కలసి తన ఇంటి దగ్గర్లో నివసించే సుభాష్‌ గోపే ఏడు నెలల కుమార్తె నిద్రిస్తుండగా అపహరించారు. తిరుల్దీ గ్రామ సమీపంలోని నదీతీరంలో నరబలి ఇచ్చారు. తర్వాత కర్మూ కనిపించకుండా పోవడంతో బాలిక అపహరణలో అతని పాత్ర ఉందని అనుమానించిన పోలీసులు గాలింపు జరిపి కర్మూ, భదోయ్‌లను అరెస్ట్‌ చేశారు. గురువారం వారిద్దరూ నేరాన్ని అంగీకరించారు. భదోయ్‌ నివాసం నుంచి నరబలికి ఉపయోగించిన ఆయుధాన్ని సీజ్‌ చేశారు. బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement