పాకిస్థాన్ గిరిజన ప్రాంతమైన దక్షిణ వజీరిస్థాన్లోని జట్రాయి గ్రామ సమీపంలో ఈ రోజు ఉదయం బాంబు పేలుడు సంభవించి ఇద్దరు పాకిస్థాన్ సైనికులు మరణించారు.
పాకిస్థాన్ గిరిజన ప్రాంతమైన దక్షిణ వజీరిస్థాన్లోని జట్రాయి గ్రామ సమీపంలో ఈ రోజు ఉదయం బాంబు పేలుడు సంభవించి ఇద్దరు పాకిస్థాన్ సైనికులు మరణించారని మిలటరీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఆ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతం తాలిబన్, అల్ ఖైదా తీవ్రవాదులకు అత్యంత సురక్షితమైన ప్రాంతం. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంపై తరచుగా యూఎస్ ద్రోణ్ దాడులు నిర్వహిస్తుంది. పాకిస్థాన్లో స్వయం ప్రతిపత్తిగల ఏడు ప్రాంతాల్లో దక్షిణ వజీరిస్థాన్ ఒక్కటన్న సంగతి తెలిసిందే.