ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఇద్దరు ఎస్‌ఐలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఒక పోలీస్‌స్టేషన్ సార్లు మరో పోలీస్‌స్టేషన్‌లో నిందితులుగా మారిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని అల్వాల్‌లో జరిగింది. అల్వాల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రావు... ఓ రియల్టర్. గత ఏడాది నిజామాబాద్ జిల్లా ఎస్ ఎస్‌నగర్ ఎస్‌ఐ ప్రతాప్‌లింగం, మెదక్ రూరల్ ఎస్‌ఐ వినాయక్‌రెడ్డితో పాటు మరో ఇద్దరికి కలిసి ఓ స్థలం అమ్మాడు. దీని విలువ సుమారు రెండు కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. అయితే... అవి డబుల్ రిజిస్ట్రేషన్ కావటంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇద్దరు ఎస్‌ఐలతో పాటు... మిగతావాళ్లు శ్రీనివాస్‌రావును కోరారు. దానికి అప్పుడు... ఇప్పుడు అంటూ రియల్టర్ శ్రీనివాస్‌రావు తప్పించుకున్నాడు. దీంతో గురువారం రాత్రి ఇద్దరు ఎస్‌ఐలతో పాటు సుమారు 20 మంది రియల్టర్ ఇంటికి వెళ్లి డబ్బుల విషయంపై గొడవ పడ్డారు. విషయం పెద్దదిగా మారి ఎస్‌ఐలిద్దరూ కలిసి శ్రీనివాస్‌రావును వ్యాన్‌లో ఎత్తుకెళ్లారు. వచ్చింది ఎవరో, ఆయనను ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాక రియల్టర్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో అల్వాల్ పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీనివాస్‌రావును తీసుకెళ్లిన వ్యాన్‌తో పాటు.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అల్వాల్ శివారులోని ఓ ఇంట్లో రియల్టర్‌ను గుర్తించారు. శ్రీనివాస్‌ను ఎత్తుకొచ్చిన ఇద్దరు ఎస్‌ఐలతో పాటు రఘు, లక్ష్మినారాయణ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అయితే... రియల్టర్ శ్రీనివాస్‌రావు వాదన మరోలా ఉంది. ఎస్‌ఐలిద్దరూ కొనుగోలు చేసిన భూమి పక్కనే ఉన్న స్థలాన్ని కూడా తమకే అమ్మాలంటూ ఒత్తిడి తెచ్చారని, వాళ్లు అడిగిన విధంగా భూమి అమ్మకపోవడం వల్లే కిడ్నాప్ చేసి... సర్వీస్ రివాల్వర్‌తో బెదిరింపులకు దిగారని అన్నాడు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. రియల్టర్‌ను ఎత్తుకెళ్లిన ఇద్దరు ఎస్‌ఐలను సస్పెండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఎస్‌ఎస్ నగర్ ఎస్‌ఐ ప్రతాప్‌లింగం, మెదక్ రూరల్ ఎస్‌ఐ వినాయక్‌రెడ్డిపై వేటు పడింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
బెదిరింపుల కేసు.. ఇద్దరు ఎస్ఐల అరెస్టు
Published Fri, Oct 16 2015 12:22 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement