లండన్: భారత వాణిజ్య రాజధాని ముంబైలోని తాజ్మహల్ ప్యాలెస్ హోటల్పై బ్రిటన్ కోర్టులో దావా దాఖలయింది. 26/11 ముంబై దాడిలో బాధితుడయిన బ్రిటన్ పౌరుడు విల్ పికె(33) ఈ దావా వేశారు. యాజమాన్యం నుంచి తగిన పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై బ్రిటన్ హైకోర్టు విచారణ ప్రారంభించింది.
భద్రతా దళాల ముందస్తు హెచ్చరికలు పట్టించుకోకుండా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే ఉగ్రవాదులు దాడి చేయగలిగారని ఫిర్యాదీ ఆరోపించారు. టాటా గ్రూపుకు చెందిన తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో భ్రదత సవ్యంగా లేదని పేర్కొన్నారు. హోటల్లో కేవలం ఒక్క మెటల్ డిటెక్టర్ మాత్రమే ఉందని తెలిపారు. 2008, నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు సాగించిన మారణహోమంలో 166 మంది మృతి చెందారు.
దాడి సమయంలో విల్ తన స్నేహితురాలు కెలీ డోలితో కలిసి తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో ఉన్నారు. ఉగ్రవాదుల దాడి నుంచి వారు ప్రాణాలతో తప్పించుకున్నారు. హోటల్స్లో అతిథుల భద్రత గాల్లో దీపంగీ మారిందని విల్ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో హోటల్ యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు.
తాజ్మహల్ హోటల్పై బ్రిటన్ కోర్టులో దావా
Published Mon, Dec 2 2013 8:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement