న్యూఢిల్లీ: ఫిబ్రవరి ఏడున జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయటం కుదరదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలు గడువు తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం పబ్లిక్ నోటీసు ఇవ్వకపోవటం వల్ల ఎక్కువమంది ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారని రాష్ట్ర నిర్మాణ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విభు భక్రు తీర్పు చెప్పారు.
ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ నిర్ధారిత సమయంలోనే విడుదల అయిందని, సరైన ప్రక్రియ ద్వారానే పోల్ పానెల్ తేదీలను నిర్ణయించిందని, ఎన్నికల నిర్వహణ జరుగుతోందనీ, అందువల్ల ప్రజాధనం కూడా వృథా కాలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఎన్నికలను వాయిదా వేయలేం: ఢిల్లీ హైకోర్టు
Published Wed, Feb 4 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement