చిన్నోళ్లకు ఇబ్బందులు ఉండవు | Union Finance Minister Arun Jaitley addresses the two-day Economic Editors' Confreence in New Delhi | Sakshi
Sakshi News home page

చిన్నోళ్లకు ఇబ్బందులు ఉండవు

Published Fri, Nov 11 2016 1:36 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

చిన్నోళ్లకు ఇబ్బందులు ఉండవు - Sakshi

చిన్నోళ్లకు ఇబ్బందులు ఉండవు

 డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ వారిని ప్రశ్నించదు
 పెద్ద మొత్తంలో జమ చేసిన వారికే ఇబ్బంది
 వారిపై పన్నుతో పాటు 200 శాతం పెనాల్టీ
 నోట్ల మార్పిడికి తొందరపడాల్సిన పని లేదు: కేంద్ర మంత్రి జైట్లీ
 
 న్యూఢిల్లీ : పెద్ద నోట్ల మార్పిడికి ప్రజలు తొందపడాల్సిన అవసరం లేదని, దీనికి డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉన్నందున వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో చిన్న మొత్తాల్లో డిపాజిట్లు చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావని ఆయన హామీ ఇచ్చారు. ఆదాయపు పన్ను శాఖ చిన్న డిపాజిటర్లను ప్రశ్నించడంగానీ, వేధింపులుగానీ ఉండవని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ ఎడిటర్స్ కాన్ఫరెన్‌‌సలో జైట్లీ ప్రసంగించారు. 
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు రోజు వారీ ఖర్చులు, అత్యవసర ప్రయోజనాల నిమిత్తం ఇంట్లో నగదు పెట్టుకోవడం సర్వసాధారణమని, వారు నిరభ్యంతరంగా తమ బ్యాంకు ఖాతాలో పెద్ద నోట్లు జమ చేసుకోవచ్చని చెప్పారు. ఇలాంటి చిన్న డిపాజిట్లపై రెవెన్యూ శాఖ దృష్టిసారించబోదని చెప్పారు. లెక్కలు చూపని నిధులను పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారు మాత్రం పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి వారికి పన్ను చట్టాల ప్రకారం.. పన్నుతో పాటు 200 శాతం పెనాల్టీ విధిస్తామని ప్రకటించారు. 
 
 పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని, జీఎస్‌టీ సహా అనేక చర్యల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హష్ముఖ్ అదియా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాల్లో రూ. 2.5 లక్షలు దాటి డిపాజిట్ అయిన వారి వివరాలను స్క్రూటినీ చేస్తామని, వారి ఐటీ రిటర్న్స్‌తో సరిపోలనట్లరుుతే పన్నుతో పాటు 200 శాతం జరిమానా విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
 పాత నోట్లతో బిల్లులు చెల్లించొచ్చు
 పాత నోట్ల మార్పిడికి సంబంధించి సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరికొంత ఊరట ఇచ్చింది. నవంబర్ 11వ తేదీ అర్ధరాత్రి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఫీజులు, విద్యుత్, నీటికి సంబంధించిన వినియోగ బిల్లులు, పన్నులు, జరిమానాలను పాత రూ.500, రూ.1,000 నోట్ల ద్వారా చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పాల కేంద్రాలు, శ్మశానవాటికలు, పెట్రోల్ బంకుల్లో కూడా 11వ తేదీ అర్ధరాత్రి వరకూ పాత నోట్లతో చెల్లింపులు జరపొచ్చని చెప్పారు. 
 
 పాక్ కాపీ చేయలేదు
 న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టిన రూ.500, 2000 నోట్లలో పొందుపరిచిన భద్రతా ప్రమాణాల వల్ల పాకిస్తాన్, ఇతర నేర నెట్‌వర్క్‌లు వాటిని కాపీ చేయలేవని భారత నిఘా వర్గాలు ధీమా వ్యక్తం చేశారుు. గత ఆరునెలలుగా రహస్యంగా ముద్రిస్తోన్న కొత్త నోట్ల భద్రతా చర్యలను ‘రా’, ఐబీ సంస్థలు నిశితంగా పరిశీలించాయని ఓ అధికారి తెలిపారు. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ప్రత్యేకంగా భారత నకిలీ కరెన్సీ రూ.500, 1000 నోట్లను ముద్రించే కేంద్రం నడుస్తోందని నిఘా వర్గాలు ఇంతకుముందే చెప్పారుు. భారత నకిలీ కరెన్సీని దోషరహితంగా ముద్రించడంలో పాక్ యంత్రాంగం ఆరితేరిందన్నాయి. ఏటా పాక్ నుంచి రూ. 70 కోట్ల విలువైన నకిలీ నోట్లు భారత్‌లోకి వస్తున్నట్లు అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement