
కేజ్రీవాల్‌కు కేంద్రం మరో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఆప్ సర్కారు సిఫార్సును తోసిపుచ్చి.. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎంసీ) వైస్ చైర్మన్‌గా బీజేపీ నేత కరణ్‌సింగ్ తన్వర్‌ను నియమించింది.
ఎన్‌డీఎంసీ సభ్యుడిగా, ఢిల్లీ సీఎంగా ఈ సంస్థకు వైస్ చైర్మన్‌ను సిఫార్సు చేసే అధికారం కేజ్రీవాల్‌కు ఉంది. దీంతో ఆయన ఆప్ నేత గోపాల్ మోహన్‌ను సిఫార్సు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చుతూ కరణ్‌సింగ్‌ను నియమించింది. నిజానికి గత సెప్టెంబర్‌లోనే ఈయనను ఎన్‌డీఎంసీ వైస్ చైర్మన్‌గా కేంద్రం నియమించింది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడటానికి ఆయన తన పదవికి రాజీనామా చేశారు.