
భారత్‌పైకి ఏలియన్స్ దాడి: కేంద్ర మంత్రి స్పందన
భారతావనిలోకి ఉన్నపళంగా గ్రహాంతరవాసులు చొరబడితే? జాంబీలు జనంపై విరుచుకుపడితే? ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం, అమెరికా హెచ్ 1బీ వీసాల నిరాకరణ, చైనా ఉత్పత్తుల ప్రవాహం.. ఆదందోళన చెందడానికి భారతీయులకు ఎన్నోకారణాలు. ఇక అంతర్గత సమస్యలకైతే లెక్కేలేదు! అలా ముందుకు సాగుతోన్న భారతావనిలోకి ఉన్నపళంగా గ్రహాంతరవాసులు చొరబడితే? జాంబీలు జనంపై విరుచుకుపడితే? ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని ముంబైకి చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కుచట్టం(ఆర్ టీఐ) ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. (చదవండి: భారత్‌పైకి ఏలియన్స్ దండయాత్ర!?)
సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైన ఈ ఆర్టీఐ కొర్రీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. 'ఇది పూర్తిగా సైంటిఫిక్ అంశం. నిజానికి ఇలాంటి కొర్రీలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ అధాకారులకు సమయం వృథా తప్ప మరోటికాదు' అని ఆయన పేర్కొన్నారు. అవునుమరి, కొందరి చేతుల్లో చాలా సమయం ఉంటుంది.. దాన్ని అవతలివాళ్ల టైమ్ వేస్ట్ చేయడానికి ఉపయోగించేవాళ్లు ఎందరో..!