30 శాతం తగ్గిన యునెటైడ్ బ్యాంకు లాభం
న్యూఢిల్లీ: మొండి బకాయిలు రెట్టింపు కావడంతో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 30 శాతం క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.61.86 కోట్లుగా నమోదు కాగా, తాజాగా అది రూ.43.53 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం సైతం రూ.2,927 కోట్ల నుంచి రూ.2,893 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో వసూలు కాని స్థూల, నికర మొండి బకాయిలు 82 నుంచి 95 శాతం మేర పెరగడం, వాటికి చేసిన నిధుల కేటయింపులతో లాభాలు తరిగినట్టు తెలుస్తోంది. స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) రూ.11,134 కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో ఇవి 16.26 శాతానికి సమానం. గతేడాది ఇదే త్రేమాసికంలో ఎన్‌పీఏలు రూ.6,112 కోట్లు (మొత్తం రుణాల్లో 8.90 శాతం)గానే ఉన్నారుు. నికర ఎన్‌పీఏలు సైతం రూ.7,185 కోట్లుగా, మొత్తం రుణాల్లో 11.19 శాతంగా ఉన్నాయి.