ఆ నిర్ణయాన్ని మార్చుకున్న అమెరికా!
వాషింగ్టన్: సిరియాలో తిరుగుబాటు దారులకు శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయాన్ని అమెరికా ఉపసంహరించుకుంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసద్ పై పోరు సల్పుతున్న తిరుగుబాటు దారులకు శిక్షణ ఇచ్చేందుకు అంతకుముందు పెంటగాన్ సంకల్పించింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లు వ్యయంతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది.
అయితే ఈ నిర్ణయంపై బరాక్ ఒబామా సర్కారు వెనక్కు తగ్గిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. సిరియాలో తిరుగుబాటు దారులకు శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్టు పేర్కొంది. దీనిపై త్వరలోనే పెంటగాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలిపింది.