వియత్నాంలో ఓవీఎల్‌కు 5 బ్లాకులు | Vietnam offers 5 oil and gas blocks to OVL | Sakshi
Sakshi News home page

వియత్నాంలో ఓవీఎల్‌కు 5 బ్లాకులు

Published Fri, Nov 22 2013 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

వియత్నాంలో ఓవీఎల్‌కు 5 బ్లాకులు

వియత్నాంలో ఓవీఎల్‌కు 5 బ్లాకులు

న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ విదేశ్‌కు వియత్నాం 5 ఆయిల్, గ్యాస్ బ్లాకులను కేటాయించింది. బిడ్డింగ్ లేకుండానే ఈ సముద్రగర్భ బ్లాకుల కేటాయింపు జరిగినట్లు ఓఎన్‌జీసీ విదేశ్ తెలిపింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, ఉజ్బెకిస్తాన్‌లోని కొసోర్ బ్లాకులోని ఈ క్షేత్రాలను వియత్నాం ప్రభుత్వ సంస్థ పెట్రోవియత్నాం నామినేషన్ ప్రాతిపదికన కేటాయించినట్లు పేర్కొంది. చైనాకున్న ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నంలో వియత్నాం వీటి కేటాయింపును చేపట్టింది.

ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్‌జీసీకి విదేశాలలో అనుబంధ సంస్థగా ఓఎన్‌జీసీ విదేశ్ వ్యవహరించే సంగతి తెలిసిందే. వియత్నాం, ఇండియా, తదితర దేశాలలో ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా పెట్రోవియత్నాంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఓఎన్‌జీసీ విదేశ్ వెల్లడించింది. ఎంవోయూలో భాగంగానే వియత్నాం 5 బ్లాకులను కేటాయించింది. ఓఎన్‌జీసీ విదేశ్ వీటిని మదింపుచేశాక ఆసక్తి ఉంటే పెట్రోవియత్నాంకు ప్రతిపాదనలు పంపించవచ్చు. ఈ బ్లాకులకు సంబంధించిన డేటాను పరిశీలించాక ఆసక్తి కలిగిన బ్లాకుల కోసమే ఓఎన్‌జీసీ విదేశ్ ప్రతిపాదనలు చేయవచ్చు. ఈ విషయాలను కంపెనీ సీనియర్ అధికారి ఒకరు ఒక ప్రకటనలో వివరించారు. ఆపై ఆసక్తి కలిగిన బ్లాకుల కోసం ఉత్పత్తి పంపకం కాంట్రాక్ట్(పీఎస్‌సీ)పై సంతకాలు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement