వ్యాపం స్కామ్ పై వివాదస్పద వ్యాఖ్యలు
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వ్యాపం కుంభకోణంపై బీజేపీ సీనియర్ నాయకుడొకరు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా చిన్న కుంభకోణం అని బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవార్జియా వ్యాఖ్యానించారు. 'ఇది మాకు చాలా చిన్న కుంభకోణం. కానీ మీకు ఇది పెద్ద స్కామ్ గా కనబడుతుంద'ని విలేకరులతో అన్నారు.
వ్యాపం స్కామ్ గురించి భయపడుతున్నవారి నైతికస్థితే దిగజారిందన్నారు. తాము మాత్రంగా ధైర్యంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యాపం స్కామ్ పై కథనాలు వెలువరించిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ అనుమానాస్పద మృతిపైనా కౌలాశ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తన కంటే జర్నలిస్టు గొప్పవాడేం కాదని వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నారు.
మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న 43 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి విదితమే.