
నిబంధనలకు తగ్గట్టుగానే నడుచుకుంటాం!
న్యూఢిల్లీ: లోక్‌పాల్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. లోక్‌పాల్ ఎంపిక కమిటీలో సభ్యుడైన లోక్‌సభ ప్రతిపక్ష నేతను ఎన్నుకోకపోవడంతో ఈ నియామకం పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం న్యూఢిల్లీలో ఈ అంశంపై రాజ్‌నాథ్‌ను విలేకరులు ప్రశ్నించగా నియమ, నిబంధనలకు అనుగుణంగానే లోక్‌పాల్ నియామకంపై నడుచుకుంటామని చెప్పారు.
ఎల్‌వోపీగా ఎవరికీ గుర్తింపు ఇవ్వకపోవడం లోక్‌పాల్‌తో పాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ , కేంద్ర సమాచార కమిషనర్ , జాతీయ మానవ హక్కుల కమిషనర్ తదితర కీలక పోస్టుల నియామకాలకు అడ్డంకిగా మారింది.