ఇది ద్వంద్వ వైఖరి కాదా?
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టులు యూనివర్సిటీల్లో అశాంతిని రేపుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆరోపించారు. ప్రధానికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కులాలు, మతాల పేరుతో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక మత ప్రాతిపదికన ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పారు. కశ్మీర్ వేర్పాటువాదంపై మాట్లాడడం కచ్చితంగా తప్పేనని అన్నారు. కేరళలో సీపీఎం హత్యారాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
సీఎం తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తామని ఆర్ ఎస్ ఎస్ నేత కుందన్ చంద్రావత్ ప్రకటన చేయడాన్ని ఆయన ఖండించారు. ‘ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల హత్యలపై ఇతర పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? అఫ్జల్ గురును ఉరి తీసినప్పుడు కొంత మంది నాయకులు అతడికి సంఘీభావం తెలిపారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా’ అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే విజయమని స్పష్టం చేశారు.