
'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'
మాథూరా: అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. 2016లో రామమందిరం నిర్మాణం ప్రారంభించకపోతే కోర్టుకెక్కడం సహా ఇతర మార్గాలు ఎంచుకుంటామని ఆయన చెప్పారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంగ్లేయులు రూపొందించిన సిలబస్ నే ఇప్పటికీ విద్యాలయాల్లో బోధిస్తున్నారని, దీన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతమున్న హిందూ జనాభాను రాజకీయ పార్టీలు చీల్చాయని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.