
బీజేపీని ఆదరించినందుకు థ్యాంక్స్: అమిత్ షా
న్యూఢిల్లీ: జార్ఖండ్ లో మంచి పాలన అందిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. జార్ఖండ్ అభివృద్ధి కేవలం బీజేపీ వల్లే సాధ్యమన్నారు. జమ్మూకశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. 2014 బీజేపీకి ఎన్నికల విజయనామ సంవత్సరమని పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఆదరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నేతలకు అభినందనలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. జార్ఖండ్ లో సుస్థిర, నీతివంతమైన పాలన అందిస్తామని తెలిపారు. చాలా కాలం తర్వాత జార్ఖండ్ ప్రజలు ఒకే పార్టీకి పట్టం కట్టారన్నారు. కశ్మీర్ లో బాగా పుంజుకున్నామని, 23 శాతం ఓట్లు సాధించామని అమిత్ షా వెల్లడించారు.