హిందూ రాజ్యం మొదలైందా?
సీఎంగా యోగి నియామçకంపై ఫాలీ నారిమన్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్‌ను నియమించడాన్ని ప్రఖ్యాత న్యాయకోవిదుడు ఫాలీ నారిమన్ తప్పుబట్టారు. ‘హిందూ రాజ్యం మొదలైందా?’ అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఆదిత్యనాథ్ నియామకం వెనక ఉన్న ఉద్దేశాన్ని చూడలేని వారు రాజకీయ పార్టీల ప్రతినిధులై ఉండొచ్చు.
కాకపోతే, తమ బుర్రలకు, కళ్లకు కచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి’ అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో అన్నారు. సీఎంగా యోగిని ఎంపిక చేయడం ద్వారా మోదీ.. తాను మతరాజ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు సంకేతమిచ్చారని వ్యాఖ్యానించారు.