నేడు లక్నోకు జగన్ | ys jagan mohan reddy to meet akhilesh yadav in Lucknow today | Sakshi
Sakshi News home page

నేడు లక్నోకు జగన్

Published Fri, Dec 6 2013 1:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

నేడు లక్నోకు జగన్ - Sakshi

నేడు లక్నోకు జగన్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజ కీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కలవనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి లక్నో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమవుతారు. లక్నో పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం అనుమతించింది.  జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టుల ఇన్‌చార్జ్ న్యాయమూర్తి ఎంవీ రమేశ్ అనుమతి మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement