రాత్రి 9 గంటలకు రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటి!
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాత్రి 9 గంటల10 నిమిషాలకు సమావేశమవ్వనున్నారు. ఈ రాత్రికి వైఎస్ జగన్ కు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. తుఫాన్ దాటికి నష్టపోయిన రైతుల కష్టాలను రాష్ట్రపతి దృష్టికి వైఎస్ జగన్ తీసుకురానున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి మంగళవారం ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ లో పాల్గొంటారు.