విభజనతో అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో సోమవారం నుంచి చేపట్టిన ఆమరణ దీక్షకు సీమాంధ్రలో సంఘీభావం వెల్లువెత్తింది. ఆమె దీక్షకు మద్దతుగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్నిప్రాంతాల్లోనూ నిరశనలు పోటెత్తాయి.
సాక్షి నెట్‌వర్క్: వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు పలు జిల్లాల్లో సోమవారం నిరవధిక నిరాహారదీక్షలకు దిగారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కొవ్వూరులోని మైథిలి సెంటర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం ఆయన ఆమరణ దీక్షకు దిగారు. కర్నూలులో మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వీ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. కడపలో ఏడురోజులుగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డిలు చేస్తున్న దీక్షలను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ, విజయమ్మ దీక్షకు మద్దతిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్ రెడ్డి, కడప నగర సమన్వయకర్త అంజాద్ బాషా, నాగిరెడ్డి సోమవారం ఆమర ణదీక్ష చేపట్టారు.
వీరితో పాటు వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి, మెడికల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు మేసా ప్రసాద్, పవన్‌లు కూడా దీక్షలో కూర్చున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆమరణ దీక్ష చేపట్టారు.
విజయమ్మకు బాసటగా...
Published Tue, Aug 20 2013 4:54 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement