
సున్నా, సున్నా కలిస్తే జీరో: అమిత్ షా
నితీష్ కుమార్ తమ పార్టీని వెన్నుపోటు పొడిచారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.
పాట్నా: నితీష్ కుమార్ తమ పార్టీని వెన్నుపోటు పొడిచారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. సున్నా, సున్నా కలిస్తే జీరో అవుతుందని... ఆర్జేడీ, జేడీ(యూ) కలిసినా కూడా అంతేనని ఆయన ఎద్దేవా చేశారు. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడారు. భూసేకరణ బిల్లు సవరణలపై అసత్య ప్రచారం చేసి బీజేపీని దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది నవంబర్ లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా అంబేద్కర్ జయంతి రోజున బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడంపై నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ ను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు.