
ప్రజల తీర్పును గౌరవిస్తాం: అమిత్ షా
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.
న్యూఢిల్లీ: బిహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఆయన అభినందనలు తెలిపారు.
'బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు నితీశ్ కుమార్ కు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు అభినందనలు. ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. కొత్త ప్రభుత్వానికి అభినందనలు. నూతంగా ఏర్పడబోయే ప్రభుత్వం బిహార్ ను అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశిస్తున్నాం' అని అమిత్ షా అన్నారు.