బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యులని బీజేపీ ఎంపీ బోలా సింగ్ పునురుద్ఘాటించారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యులని బీజేపీ ఎంపీ బోలా సింగ్ పునురుద్ఘాటించారు. పార్టీ ఓటమికి గల కారణాలపై అమిత్ షా వివరణ ఇవాలని లేదా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.
బిహార్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై అగ్రనేతలే నిర్ణయం తీసుకున్నారని, ఓటమికి వారే బాధ్యత వహించాలని బెగుసరాయ్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బోలా సింగ్ అన్నారు. 'బీజేపీకి కేన్సర్ సోకింది. దీన్ని నిర్మూలించాల్సిన అవసరముంది' అని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల ప్రభావం బిహార్ ఎన్నికల్లో లేదని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు.