'రాయల'కు నిరసనగా 5న తెలంగాణ బంద్: కేసీఆర్
Published Tue, Dec 3 2013 7:30 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
రాయల తెలంగాణ ఏర్పాటుపై వార్తలు మీడియాలో వెలువడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు తెర తీస్తోంది. పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కోసం బుధవారం జిల్లాలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఎలాంటి అంక్షలు లేని తెలంగాణ కోసం డిసెంబర్ 5 తేదిన బంద్ కు పిలుపునిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలతోపాటు ఇతర సంస్థలు బంద్ కు సహకరించాలని ఆయన అన్నారు. ఇది తెలంగాణలో ప్రతి ఇంటికి సంబంధించిన విషయమని కేసీఆర్ వ్యాఖ్యాలు చేశారు.
రాయల తెలంగాణ ఏర్పాటుపై తమకు విశ్వసనీయమైన సమాచారం ఉంది అని.. అందుకే నిరసన తెలుపుతున్నామని కేసీఆర్ అన్నారు. రాయల తెలంగాణను ఎవరు అడిగారు అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పిల్లల ఆత్మబలిదానాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తామని కేసీఆర్ హెచ్చరించారు.
Advertisement
Advertisement