విదేశీ మహిళకు టోకరా: వెల్వో ట్రావెల్స్ డైరెక్టర్ అరెస్ట్
తాను ఇండియన్ కరెన్సీని యూరోల్లోకి మారుస్తానని ట్రావెల్స్ చెక్ ద్వారా ఈ పని సులువుగా అవుతుందని ఆమెను నమ్మించాడు. ఇందుకోసం మల్టీ కరెన్సీ వీసా కార్డు ఇస్తానని దాన్ని ఆమె తల్లి సరళా దీక్షిత్ పేరుతో జారీ చేస్తున్నట్లు చెప్పి వియన్నాలో సరళా దీక్షిత్ బ్యాంకు అకౌంట్ నుంచి డ్రా చేసుకోవచ్చని చెప్పాడు. ఈ మేరకు కార్డు ఇచ్చాడు. తీరా ఆమె వియన్నా వెళ్లే క్రమంలో ఈ కార్డు ద్వారా యూరోలు డ్రా చేసుకోవడానికి యత్నించగా పనిచేయలేదు. బాధితురాలి ఒత్తిడి మేరకు అతడు పలుమార్లు ఇచ్చిన చెక్కులను డ్రా చేసుకోవడానికి యత్నించగా బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితురాలు రెండు రోజులక్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420, 406ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.