ఇది నాయకత్వ మార్పుతో నయంకాని రుగ్మత
అవలోకనం
బలమైన, ప్రభావశీలమైన రాజకీయ కథనమేదీ అందించలేకపోవడమే కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద వైఫల్యం. ఇది ఆ పార్టీని అవసానకాల క్షీణతకు చేర్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను కోల్పోయి, జాతీయ స్థాయిలోనూ ఓడిపోతోంది. ఇలాంటి పార్టీలు కొత్త నాయకత్వం వల్ల పునరుజ్జీవితమయ్యేవి కావు. ఆ విషయాన్ని అంగీకరిద్దాం.
కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏమిటి? మన దేశంలోని అతి పాత పార్టీ చరిత్రలోనే అధ్వాన స్థితిలో ఉంది. తనంతట తానుగా కోలుకునేలా సైతం లేదు. అది దాని అవసాన కాల క్షీణ దశలో ఉన్నదా లేక ఒక కొత్త నేత వచ్చి పునరుజ్జీవితం చేస్తాడని ఎదురు చూస్తోందా? అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఆ పార్టీలో మొదట కొట్టవచ్చినట్టుగా కనిపించేది, నిరాకరణ. అంటే తమ పార్టీని ఏదో దీర్ఘ కాలిక సమస్య పట్టిపీడిస్తోందనే దానిపట్ల అపనమ్మకం. రెండు కార ణాల రీత్యా ఇది అర్థం చేసుకోగలిగినదే. ఒకటి, కేవలం 34 నెలల క్రితమే కాంగ్రెస్ సంఖ్యాధిక్యతను గలిగి దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీగా ఉండటం. వరు సగా పదేళ్లు కాంగ్రెస్ ప్రధాని అధికారంలో ఉండటం... 1970లలోని ఇందిరా గాంధీ పాలన తదుపరి ఇదే మొదటిసారి. అలాంటి దశ ముగింపునకు వచ్చిం దంటే అది తాత్కాలికమైనదేనని, ఓటర్లు తిరిగి తమ పార్టీకి అనుకూలంగా మారు తారని అనుకోవడం సహజమే. ఇక రెండవ కారణం, కుటుంబ నియంత్రణలోని ఏ పార్టీలోనైనా ఉండే ఆశ్రిత వర్గం జనాదరణగల నేతలై ఉండరు. వారికి నాయక త్వానికి నిజాన్ని చెప్పడం వల్ల ఒరిగేదీ ఉండదు, పార్టీ శ్రేణులను సమీకరించాల్సిన బాధ్యతా ఉండదు. కాబట్టి, వారికి సైతం క్షేత్ర స్థాయి వాస్తవికత తెలిసి ఉండదు.
రెండు, తమదైన రాజకీయ కథనం అంటూ ఒకటి లేకపోవడమే సమస్య తప్ప, నాయకుడు లోపించడం కాదు. నిజమే, నరేంద్ర మోదీకి చాలా ఆకర్షణ శక్తి ఉంది. అది ఇతరులలో అంకితభావాన్ని ప్రేరేపిస్తుంది. ఆయన గొప్ప ఉపన్యాసకు డని మనకందరికీ తెలుసు. అయితే, ఆయనకున్న ముఖ్య ప్రతిభ సూక్ష్మీకరణ. అంటే దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను సైతం అతిగా సరళీకరించిన చట్రంలోకి కుదించేయడం. ఉదాహరణకు, బలహీనమైన, పిరికి నాయకత్వం వల్లనే ఉగ్రవాదం పెచ్చరిల్లిందని, తాను దాన్ని తుదముట్టించేస్తానని ఆయన అంటారు. కానీ ఆయన ఆ పని చేయలేరనే వాస్తవం ఇప్పడు మనకు తెలిసింది. అయినా దానికి వ్యతిరేకమైన రాజకీయ కథనం ఏదీ లేదు.
రాజకీయ చర్చ ఏ పరిధుల్లో, ఏ ప్రాతిపదికలపై సాగాలో కూడా మోదీ చాలా చక్కగా నిర్వచించగలుగుతారు. కాబట్టే దేశంలోని పౌరులందరిపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపిన పెద్ద నోట్ల రద్దును... నల్లధనానికి, ఉగ్రవాదానికి, నకిలీ నోట్లకు వ్యతిరేకంగా సాధించిన గొప్ప విజయంగా చలామణీ చేయగలిగారు. బలమైన, ప్రభావశీలమైన రాజకీయ కథనాన్ని దేన్నీ అందించలేకపోవడమే రాహుల్ గాంధీ అతి పెద్ద వైఫల్యం. ఆయన బహిరంగ ఉపన్యాసాల్లోని నిస్తేజం, నిస్సత్తువ ద్వితీయ ప్రాధాన్యంగల బలహీనతలు మాత్రమే. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఆధార్‌లను మోదీ నీరుగారుస్తున్నా... వాటిని సొంతం చేసుకునే సామర్థ్యం సైతం ఆయనలో కొరవడింది.
క్షేత్ర స్థాయి కార్యకర్తలు లేకపోవడం మూడో సమస్య. భారతీయ జనతా పార్టీకి క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. వారిలో చాలా మంది అంకితభావంగల వారు, అత్యున్నతస్థాయి ప్రేరణ గలవారు. కొన్నేళ్ల క్రితం వరకు వ్యక్తులను పరిచయం చేయడానికి ‘స్వాతంత్య్ర సమర యోధుడు’ అనే మాట మనకు వినిపిస్తుండేది. ఈ వ్యక్తులు కాంగ్రెస్ నేతృత్వంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించినవారు. 1930లలో పుట్టిన వారు కాంగ్రెస్ పేరు స్వతంత్రంతో ముడిపడి ఉన్నందున నెహ్రూకు, ఆ తర్వాత ఇందిరా గాంధీకి తమ సేవలను అందించారు. 1980ల కల్లా ‘కాంగ్రెస్ కార్యకర్త’ అనే ఆ వ్యక్తి అదృశ్యం కావడం ప్రారంభమై, నేడు అస్తిత్వంలోనే లేకుండా పోయాడు. హిందుత్వ లేదా కమ్యూనిజంలాగా ఆ పార్టీకి ఏదైనా ఒక భావజాలం లేదు. ప్రత్యేకించి, దళితులలో మాయావతికి, ముస్లింలలో అసదుద్దీన్ ఒవైసీకి ఉన్నట్టు ఆ పార్టీకి విధేయమైన సామాజిక పునాది కూడా లేదు.
ఈ వాస్తవం కారణంగా స్థానిక కాంగ్రెస్ నేతలు తమ సొంతడబ్బుతో మద్ద తుదార్ల పునాదిని తయారుచేసుకోక తప్పడం లేదు. ఇది నాలుగో సమస్యకు దారితీస్తుంది, అది వనరులు. ఎన్నికలకు భారీ మొత్తాల్లో డబ్బు అవసరం. ఎన్ని కల రాజకీయాలకు నిధులు రెండు మార్గాల ద్వారా సమకూరుతాయి. పార్టీకి వచ్చే అధికారిక విరాళాలు, సభ్యత్వ రుసుముల ద్వారా లేదా అవినీతి ద్వారా వచ్చేవి. ఈ నిధుల్లో కొంత భాగాన్ని అభ్యర్థులకు పంపిణీ చేసి, మిగతా దాన్ని జాతీయ స్థాయి ప్రచారం, ప్రయాణాలు, ప్రదర్శనలు, సభలకు అయ్యే వ్యయాలు వగైరాకు సాధారణ నిధికి పంపుతారు. ఇక రెండవది అభ్యర్థులు పెట్టే వ్యక్తిగత పెట్టుబడి. శాసనసభలకు పోటీ చేయడానికి రూ. 10 కోట్లకు పైగా, పార్లమెంటుకైతే మరింత ఎక్కువ కావాలి. ఇది రహస్యమేం కాదు. నేడు కాంగ్రెస్ రెండు పెద్ద రాష్ట్రాల్లోనే.. కర్ణాటక, పంజాబ్‌లలోనే అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలే ఆ పార్టీ జాతీయ స్థాయిలో మనగలగడానికి తగినంత డబ్బును సమకూర్చలేవు. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన అభ్యర్థులు ఇక ఎంత మాత్రమూ తమ సొంత డబ్బును భారీగా వెచ్చిం చరు. ఓటమి పాలయ్యే పార్టీకి భారీగా పెట్టుబడి పెట్టే మూర్ఖులు ఎవరుంటారు?
ఇది ఆ పార్టీని అవసానకాల క్షీణతకు చేర్చింది. కాంగ్రెస్ రాష్ట్రాలను కోల్పో యింది కాబట్టి, జాతీయస్థాయిలోనూ ఓడిపోతోంది. అది ప్రతిపక్షంలో ఉన్న గుజ రాత్‌లాంటి రెండు పార్టీల రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్‌కు గెలిచే శక్తిలేదు. గుజరాత్‌లో జరిగిన లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చివరిసారిగా మూడు దశా బ్దాల క్రితం గెలిచింది. నేటి శివరాజ్‌సింగ్ చౌహాన్, రామన్‌సింగ్‌ల పదవీ కాలం ముగిసేటప్పటికి కాంగ్రెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారానికి దూరంగా ఉండి 15 ఏళ్లు అవుతాయి. చూడబోతే అది శాశ్వతంగానే ప్రతిపక్షంలో ఉండే ట్టుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో ఇప్పుడూ, యూపీ, బిహార్, తమిళనాడు లలో ముందే అది అర్థవంతమైన ప్రతిపక్షం హోదాను సైతం కోల్పోయింది.
ఇలాంటి పార్టీలు కొత్త నాయకత్వం వల్ల పునరుజ్జీవితమయ్యేవి కావు. ఆ విషయాన్ని అంగీకరిద్దాం. ఆగ్రహావేశపూరితమైన నేటి జాతీయవాదం భయా నికి... తన కుమారుడి మృతదేహాన్నే వద్దనుకున్న ముస్లిం తండ్రిని అది శ్లాఘి స్తుంది. మరణంలోసైతం శత్రుత్వం, ద్వేషం మిగిలే ఉంటాయి. ఏ విలువలూ, ఎలాంటి విశ్వసనీయతాలేని అలాంటి పార్టీలు బతికి బట్టకట్టే ఆశలేదు, చని పోతాయి. కాంగ్రెస్‌కు తెలిసివస్తున్నది అదే.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com